పోషకాహారం తీసుకోవాలి:జెడి

Mar 9,2024 21:21

ప్రజాశక్తి- బొండపల్లి: గర్భిణులు, బాలింతలు తీసుకున్న ఆహారంలో పోషకపదార్ధాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ జాయింట్‌ డైరెక్టర్‌ మనోరంజని కోరారు. శనివారం మండలంలోని గొట్లాంలో జాతీయ పౌష్టికాహార పక్షోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ రోజు తీసుకొనే ఆహారంలో పోషక విలువలతో కూడిన ఆకు కూరలు, కూరగాయలు వంటి పదార్ధాలు ఉండాలన్నారు. మనకు గ్రామాలలో అందుబాటులో ఉండే సహజ సిద్దమైన ఆకు కూరలు ఆహారంగా తీసుకోవడం ద్వారా చాలా వరకు రక్త హీనతను నివారించవచ్చని చెప్పారు. బయట దొరికే జంకు ఫుడ్స్‌ కాకుండా ఇంట్లో తయారు చేసే ఆహార పదార్ధాలని పిల్లలకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని అన్నారు. జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శాంతి కుమారి పోషాకాహార పక్షోత్సవాల ద్వారా పౌష్టికాహారం పై బాలింతలకు, గర్బిణులకు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసియస్‌ అద్యక్షులు మహంతి రమణ, సర్పంచ్‌ ఆదిలక్ష్మి, సీనియర్‌ వైసిపి నాయకులు మీసాల తులసీరావు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.తెర్లాం: మండల కేంద్రంలోని అంగన్‌వాడీల్లో ఆదివారం పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ఉషారాణి ఆధ్వర్యంలో పౌస్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శ్రీదేవి, జి. లక్ష్మి, సునీత, పిల్లల తల్లిదండ్రులు, కిషోర్‌ బాలికలు, ఎఎన్‌ఎం పాల్గొన్నారు.

➡️