పోరు ఆగదు

Dec 26,2023 21:39 #పోరు ఆగదు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం జిల్లా వ్యాపితంగా ప్లేట్లతో మోత మోగిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. రాయచోటి టౌన్‌ : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉద్భతం చేస్తామని అంగన్వాడీ వర్కర్ల యూనియన్లు ప్రకటించాయి. మంగళవారం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ భాగ్యలక్ష్మి కోశాధికారి పి.బంగారుపాప స్థానిక ప్రభుత్వ జానియర్‌ కలాశాల ఆవరణలో ప్లేట్లు చేత పట్టి గనగన మోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె 15 రోజులకు చేరిందని, అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ అమలు తదితర విషయాల్లో ప్రభుత్వం నోరు మెదపలేదని పేర్కొన్నారు. గతంలో జరిగిన చర్చల్లో మినీ సెంటర్లను సెంటర్లుగా మారు స్తామని అంగీకరించారని, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన జిఓ ఇవ్వలే దన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులతో కేంద్రాల తాళాలు పగలగొ ట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ గ్రేడ్‌-2 సూపర్వైజర్‌ 560 పోస్టులు ఇచ్చామని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అబద్ధాలు ఆడుతు న్నారని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క పిల్లాడికి కూడా సరైన తిండి పెట్టలేక పోతుందన్నారు. ప్రభుత్వం అద్దెలు ఇవ్వకపోయినా గర్భిణులు, బాలింతలకు పోషణ అందిం చామన్నారు. లబ్దిదా రులకు ఇచ్చే ఆహారం నాసిరకంగా ఉందని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యులతో ఖాళీ కంచాలు, గంటలు మోగిస్తామని తెలిపారు. 27న ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు ఇళ్లు, క్యాంపు కార్యాలయాలకు సామూహిక వినతిపత్రాలు అందిస్తామని అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి నుంచి పోరాటాన్ని ఉదతం చేస్తామని తెలిపారు. తమ ఆందోళనలకు రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజలు విశాల మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు విజయమ్మ సిద్దమ్మ నాగమణి అరుణ మస్రూన్‌ బీ సుమలత వనజ ప్రవీణ సబీనా రమీజా ఇందిరమ్మ పాల్గొన్నారు. మదనపల్లి : అంగన్వాడీ కార్మికులు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుంచి ప్లేట్లు గెరిటలతో వాయిస్తూ(శబ్దం చేస్తూ) ర్యాలీగా వచ్చి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మధురవాణి ,రాజేశ్వరి మాట్లాడుతూ 15రోజులుగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరి ంచాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహి స్తున్నామని అందులో భాగంగా మంగళవారం తట్టా గెరిటలతో శబ్దం చేస్తూ ర్యాలీ గవచ్చి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియ జేశామన్నారు. కార్యక్రమంలో గౌరీ, కరుణ, స్వారూప, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళ్తూ పళ్లేలు మోగించి వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శివరంజని, విజయమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. రైల్వేకోడూరు : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారానికి15వ రోజుకు చేరింది. ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు భోజనం ప్లేట్లు, గరిటలతో చప్పుడు చేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు గౌరవ అధ్యక్షురాలు, మంజుల. అధ్యక్షురాలు ఎన్‌ రమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాధా కుమారి, మండల కార్యదర్శి జి పద్మ,, వెన్నెల, శిరీష, లీలావతి, ఈశ్వరమ్మ, మైథిలి, సునీత, నిర్మల, వాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పి జాన్‌ ప్రసాద్‌, అంగన్వాడి వర్కర్స్‌ అసోసియేషన్‌ ఎఐటి యుసి జిల్లా కో- కన్వీనర్‌ సరోజ పాల్గొ న్నారు. తంబళ్లపల్లె : అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ధర్నాను నిర్వహించారు. 15వ రోజు మంగళవారం అంగన్వాడీల సమ్మెలో భాగంగా తంబళ్లపల్లి బూదలవాండ్లపల్లి సమీపంలో మూడు రోడ్ల వద్ద సమ్మె నిర్వహించారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. అంగన్వాడీల కోరికలు న్యాయమైనవని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, ప్రస్తుతం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలు స్వాధీనం చేసుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తక్షణం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలకు మద్దతుగా ప్రజలను కూడగట్టి ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మెకు వెలుగు యానిమేటర్స్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు గౌరి, కరుణశ్రీ, సులోచన, స్వరూప, ప్రమీల, సరస్వతి, ఉమాదేవి, షరీఫా, విఓఏ యూనియన్‌ నాయకులు రెడ్డెప్ప, రాణి, రాజేశ్వరి లతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️