పోటీ కార్మికులకు అడ్డుకుని బైటాయింపు

దాచేపల్లిలో సమ్మె కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి – దాచేపల్లి : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో దాచేపల్లిలో అధికారులు గురువారం ఉదయం పోటీ కార్మికులను రంగంలోకి దించారు. వీరిని సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకుని రోడ్డుపై బైటాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమ్మె కార్మికులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అధికారులు, పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు పోలీస్‌స్టేషన్‌ వద్దా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు టి.శ్రీనివాసరావు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే అధికారులు మాత్రం పోటీ కార్మికులను తెచ్చి పుండుపై కారం చల్లినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమ్మె విచ్ఛిన్నపు చర్యలను సహించేది లేదని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కార్మికులు, నాయకులను పోలీసులు విడుదల చేశారు. సమ్మెకు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
ప్రజాశక్తి – నరసరావుపేట : తమ సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్యే అనుచరులే ధ్వంసం చేశారని మున్సిపల్‌ కార్మికులు మండిపడ్డారు. దుండగులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు సమ్మె శిబిరం నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన చేసి ఆర్‌డిఒ ఎం.శేషిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ బెదిరించడం, రెచ్చగొట్టడంతోపాటు శిబిరాన్నీ ధ్వంసం చేశారని మండిపడ్డారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌, పట్టణ అధ్యక్షులు టి.మల్లయ్య, కార్యదర్శి డి.యోహాను కార్మికులు జయరాజు, నవీన్‌, శేఖర్‌, దీనమ్మ, సాల్మన్‌, జీవరత్నం పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగుతోంది. దాచేపల్లిలో పోటీ కార్మికులను అడ్డుకున్నందుకు సమ్మె కార్మికులను, సిఐటియు నాయకులను అరెస్టు చేయడంపై నిరసన తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలు చేస్తే ఈ ప్రభుత్వాన్ని కనికరం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, కార్మికులు కె.సీతారామయ్య, కె.కొండలు, ఎ.రామారావు, ఎన్‌.సురేష్‌, బి.వెంకటేశ్వర్లు, టి.శ్యాంకోటి, పద్మ, వీరమ్మ, సుజాత, అనంతలక్ష్మి, జయేంద్ర, వెంకటమ్మ పాల్గొన్నారు.
సమ్మెలోకి మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు
ఇదిలా ఉండగా తామూ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నట్లు మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు ప్రకటించారు. ఈ మేరకు నోటీసును కమిషనర్‌ ఎ.వెంకటేశ్వరరావుకు గురువారం అందజేశారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, రాజు, షేక్‌ సుభాని, రమేష్‌, కొక్కెర శ్రీను, ఎస్కే హుస్సేన్‌, తిరుపతిరావు, సురేష్‌, వెంకయ్య, రవీంద్ర పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వీరికి మద్దతుగా ఎఐటియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. మున్సిపల్‌ కార్యలయం వద్ద నుండి శివయ్య స్తూపం పల్నాడు రోడ్డు, లాయర్‌ స్ట్రీట్‌, నరసరావుపేట రోడ్డు మీదగా పలు ప్రదర్శన సాగింది. నాయకులు ఎ.మారుతి వరప్రసాద్‌, బి.శ్రీనివాసరావు, బి.చిన్న, ఆర్‌.వందనం, ఎస్‌.అబ్రహం రాజు, పి.ఏసు, ఆర్‌.ఏసుపాదం, శ్రీను, సాయి, గురువమ్మ, నాగరాణి, దేవమ్మ, రాహేలమ్మ, జాను, పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : పారిశుధ్య కార్మికులకు టిడిపి అండగా పూర్తిగా ఉంటుందని ఆ మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి ప్రకటించారు. మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఆయన టిడిపి, జనసేన నాయకులతో కలిసి గురువారం సందర్శించారు. కార్మికులకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం కూడా చేస్తామన్నారు. మద్దతు తెలిపిన వారిలో టిడిపి, జనసేన నాయకులు పి.ఆంజయ్య, కె.దుర్గారావు, ఎం.వాసు, జి.నాగేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, రామాంజనే యులు, ఎన్‌.ప్రసాదు, బాదన్‌బారు ఉన్నారు. సిపిఐ నాయకులు ఎం.శ్రీనివాసరెడ్డి, బాబురావు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. యూనియన్‌ నాయకులు కె.రమణ, అనసూయ, బి.చిన్నమ్మాయి, లక్ష్మీదేవి, డి.రమణ, ఇస్సాకు, ఆంజమ్మ, మల్లమ్మ, సుబ్బారావు, డి.వెంకటేశ్వర్లు, అబ్రహం లింకన్‌, కోటేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు భిక్షాటన చేపట్టారు. సిఐటియు నాయకులు జె.రాజకుమార్‌, చంద్రకళ, పెదవెంకయ్య, కార్మికులు పాల్గొన్నారు.

➡️