పెళ్లి కాదు.. నిశ్చితార్థం..

Mar 28,2024 19:05 #movie, #sidharth

అదితి రావు హైదరీ-సిద్ధార్థ్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు బుధవారం నుండి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, సిద్ధార్థ్‌- అదితి రావు హైదరీ గురువారం తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టి పెళ్లిపై స్పష్టత ఇచ్చారు. అతను ఒకే చెప్పడంతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాము అని, రింగ్‌ పెట్టుకున్న ఫొటోను అదితి షేర్‌ చేశారు. అలాగే సిద్ధార్థ్‌ కూడా ఆమె ఎస్‌ చెప్పడంతో నిశ్చితార్థం చేసుకున్నామని అదే ఫొటోను పోస్టు చేశారు.

➡️