పలుచోట్ల ఆశా వర్కర్ల ధర్నా

Feb 9,2024 16:32

మండపేట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఆశాలు

ప్రజాశక్తి-యంత్రాంగం

ఆశా వర్కర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగం చేసిన పోలీసులు తమ నాయకులను ఎక్కడ దాచారో తెలపాలంటూ జిల్లాలోని మండలాల్లో ఆయా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. రామచంద్రపురం ఆశా వర్కర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగం చేసిన పోలీసులు తమ నాయకులను ఎక్కడ దాచారో తెలపాలంటూ కె.గంగవరం మండలంలోని ఆశా వర్కర్‌ లు శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో ఉన్న ఆశ వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం నిర్బంధించడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుందూరు, దంగేరు, పేకేరు తదితర గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ కు వినతిపత్రం అందజేశారు. మండపేట ఆశా కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగం చేసిన పోలీసులు తమ నాయకులను ఎక్కడ దాచారో తెలపాలంటూ మండపేట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేయడం దారుణం అన్నారు. సిఎం జగన్‌ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధానంలో వ్యవహరిస్తుండడం పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా గహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఆపేయాలని ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. మామిడికుదురు ఆశా కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగం చేసిన పోలీసులు రాష్ట్ర కార్యదర్చి ధనలక్ష్మిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మామిడికుదురు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని మండల అధ్యక్షురాలు కె.సూర్యావతి అన్నారు. అంగన్‌ వాడీ వర్కర్స్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమలో సిహెచ్‌.దుర్గాదేవి, ఎం.రత్నకుమారి, డి. కామేశ్వరి, పావని తదితరులుపాలుగున్నారు.ఆలమూరు ఆశా వర్కర్ల డిమాండ్లును నెరవేర్చకుండా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరి అయినది కాదని అలాగే ఆశా వర్కర్స్‌ కి న్యాయం జరిగే లా ప్రభుత్వం కషి చేయాలంటూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద స్థానిక ఆశ వర్కర్లు నిరసన చేపట్టారు. అలాగే ఆశా వర్కర్ల మండల అధ్యక్షులు కె.పోసమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పాల్గొని వర్కర్స్‌ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మెమోరాండంతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకిి కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారం తగ్గించాలని, వాళ్ళకి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ రూ.10 లక్షల వరకు కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

 

 

➡️