పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వెంకటరమణ

ఫోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా జిల్లా

వెంకటరమణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఫోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా జిల్లా బార్‌ అసోసియేషన్‌ మెంబరు లోలుగు వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన కీ.శే. ఎస్‌.వి.ఎ.భాస్కరరావు వద్ద జూనియర్‌గా ప్రాక్టిస్‌ చేశారు. ఈయన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులు కావడంపై బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎన్ని సూర్యారావు, బిసి అడ్వకేట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఆగూరు ఉమామహేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు బెజ్జిపురం ఫల్గుణరావు, ప్రధాన కార్యదర్శి చౌదర లక్ష్మణరావు, సీనియర్‌ న్యాయవాది సనపల హరి, కస్పా ప్రతాప్‌చంద్ర అభినందనలు తెలిపారు.

 

➡️