పడకేసిన పల్లె ప్రగతి

Dec 7,2023 22:09
పడకేసిన పల్లె ప్రగతి

నీరశిస్తున్న గ్రామీణం మౌలిక వసతులకు నిధుల కొరత నిధులు లేక ఖాతాలు ఖాళీ..ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ గ్రామ పంచాయతీల అభివృద్ధి దేవుడు ఎరుగు…. కనీస మౌలిక వసతుల కల్పనకు గ్రామసర్పంచ్‌లు నిధులు లేక తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ఇచ్చే నిధుల సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో దిక్కుతోచని స్థితిలో తమను గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పలేక ముఖం దాచుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ సర్పంచ్‌లు కేంద్ర ప్రభుత్వం మంజురు 15వ ఆర్థిక సంఘం నిధుల్విలంటూ కోర్టులు, ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదాయే… ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, చిన్న పాటిరోడ్లు మరమ్మతులు కూడా చేయలేని స్థితి గ్రామీణం నీరశిస్తోంది. తుపాను ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో అంటు వ్యాధిలు ప్రభలే అవకాశాలు ఎక్కువ …. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల క్లోరినేషన్‌, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు, అంటు వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్‌ చల్లెందుకు నిధులు లేక కొందరు సర్పంచ్‌లు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తుంటే మరికొందరైతే తమ వల్లకాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు, డ్రైనేజి ఇతర ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. చేసిన పనులకు జూలై నుండీ బిల్లులు రాకపోవడమే కారణంగా చెబుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక వడ్డీలు కట్టుకోవాల్సి వస్తోందంటున్నారు. మరో వైపు గ్రామ పంచారయల్లో పారిశుధ్య పనులు నిర్వహించే గ్రీన్‌ అంబాసిడర్లకు నెలల తరబడీ జీతాలు చెల్లించలేని పరిస్థితి. గ్రామ పంచాయతీల్లో కాలువల్లో మరుగు తీయాలన్నా, పారిశుధ్యం లోపించిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లాన్నా చెత్తను శుభ్రం చేయాలన్నా ఖాతాల్లో డబ్బులు లేక మౌలిక వసతులను కూడా కల్పించలేని స్థితి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. ఇక వీధి దీపాలు మరమ్మతు చేయించకపోవడంతో చీకటిలోనే పల్లెవాసులు మగ్గుతున్నారు. వర్షకాలంలో మురుగు కాలువలు శుభ్రం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడానికి నిధులు లేకపోవడంతో అలాగే వదిలేస్తున్నారు. దీంతో మురుగు నిల్వ చేరి ఆనీటిలో దోమలు వృద్ధిచెంది గ్రామీణులు రోగాల భారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు పాకింగ్‌ చేసే పరిస్థితిలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు చిత్తూరు జిల్లాకు రూ.46,48, 693 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల పేరుతో కొంత జమ చేసుకోకాగా మిగిలిన సొమ్ము కూడా పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుండా దారి మళ్లించింది. జిల్లాలో చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 697 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 36,7,659 ఆవాసాలున్నాయి. జనాభా విషయానికి వస్తే జిల్లాలో 15,14,050 మంది ఉన్నారు. ఇంత పెద్దసంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు కనీస మౌళిక వసతులకు నోచుకోవడం లేదు. వీధిలైట్లు, డ్రైనేజీలు, రోడ్లు మరమ్మతులు, తాగునీరు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు క్లీనింగ్‌ వంటి పనులు చేపట్టకపోవడంతో పల్లెప్రగతి పడకేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేసి, గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు తొడ్పాటును అందించాలని సర్పంచ్‌ల సంఘం నాయకులు, గ్రామీణ వాసులు కోరుతున్నారు.

➡️