పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ప్రజాశక్తి-అమలాపురం

గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసి జాయిం ట్‌ కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్య క్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు జార్జి సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, హైకోర్టు తీర్పు మేరకు టెండర్ల విధానం ఉపసం హరించాలని, ఉద్యోగ భద్రత కల్పిం చాలని, ఆరులైన వారందరినీ రెగ్యులర్‌ చేయాలని, సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పిలుపు లో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్నామని, తమ న్యాయ మైన విమాండ్లను పరిష్కరించాలని లేనియెడల 22 మండలాల గ్రామపంచాయతీ కార్మికుల ఐక్యం చేసి సమ్మెబాట పెడతామని హెచ్చరిక చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ల గడుస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకున్న వేతనాలు ఇతర సౌకర్యాలు, జిఒలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. కార్యక్రమంలో కె.నాగప్రసాద్‌, ఎస్‌.నరసింహామూర్తి, పణికుమార్‌, సతీష్‌, శ్రీనివాస్‌, వేమలరావు ,నిమ్మకాయల వెంకటేష్‌, పాము బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

 

➡️