న్యాయవాదిపై ఇంటి యజమాని దాడి

మాచర్ల:  పట్టణంలో న్యాయవాది లక్ష్మీనారాయణ కుమార్తె చదువుతున్న పాఠశాలకు సమీపంలో ఆ న్యాయవాది సుమారు రెండేళ్లుగా అద్దె భవనంలో నివసిస్తున్నాడు. తన కుమార్తె పదో తరగతి చదువు తోంది. ఇంటి యజమాని కోట శ్రీనివాసరావు ఇంటిని ఖాళీ చేయాలని కొన్ని రోజులు లక్ష్మీనారాయణకు చెప్పాడు. పదో తరగతి పరీక్షలు మార్చిలో అయిపోగానే వెంటనే ఇంటిని ఖాళీ చేస్తామని యజమానికి చెప్పాడు. ఆ మాటను పట్టించుకోని యజమాని కోట శ్రీనివాసరావు శనివారం తన బంధువులతో కలసి లక్ష్మీనారాయణ ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో సామాన్లు బయటపడేసి దాడి చేశారు. ఇరుగు పొరుగు వారి సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు ఉప్పు లక్ష్మీ నారాయణను తరలించారు సమాచారం అందుకున్న న్యాయవాదులు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి లక్ష్మీ నారాయణ పరామర్శించారు జరిగిన సంఘటన వివ రాలను తెలుసుకున్నారు. న్యాయవాదిపై దాడి చేయడం హేయమైన చర్య అని, సోమవారం నిరస నగా నల్లబ్యాడ్జీలతో విధులు బహిష్కరిస్తామని చెప్పా రు. పరామర్శించిన వారిలో సీనియర్‌ గట్ల సత్య నారా యణ రెడ్డి, కష్ణమూర్తి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.

➡️