నోటిఫికేషన్‌ అడిగితే అరెస్టులు చేస్తారా?: డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-కడప అర్బన్‌ నిరుద్యోగులు ఏళ్ల తరబడి డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తుంటే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అడిగితే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్ప డటాన్ని యువజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామని డివైఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి వీరనాల శివకుమార్‌ తెలిపారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం ఫూలే సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సీ విడుదల చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగుల జీవి తాలతో చెలగాటం ఆడుతున్నదన్నారు. సంవత్సరాల కొలది కోచింగ్‌ సెంటర్లలో రూ.వేలు ఖర్చు చేసుకుంటూ వయో భారంతో మనో వేదనకు గురవుతు న్నారన్నారు. డిఎస్సీ వస్తుందో రాదో అని బిఇడి, టిటిసి చదివిన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. డివైఎఫ్‌ఐగా డిఎస్సీ విడుదల చేయాలని చలో విజయవాడ పిలుపునిస్తే కనీసం నాయకులను కలవనీ యకుం డా నోటిఫికేషన్‌ విడుదల చేస్తా మని చెప్పకుండా ఎమర్జెన్సీని తలపించే విధంగా డివైఎఫ్‌ఐ నాయకులను రెండు రోజులు ముందే ఎక్కడికక్కడ అరెస్టులు, నోటీ సులు, గహ నిర్బంధాలు చేసి విజ యవాడలో అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. జగన్మోహన్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదని తెలిపారు. ఇలా నియంతలా వ్యవహరించిన తెలంగాణలో యువత ప్రభుత్వాన్నే మార్చేశారన్నారు. రాష్ట్రంలో 25 వేల పోస్టులతో మెగా డిఎస్సీను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, నాయకులు సునీల్‌, సురేష్‌, సంజీవ పాల్గొన్నారు.

➡️