నైతిక విలువలు పెంపొందించాలి

ప్రజాశక్తి-చీమకుర్తి: విద్యార్థులలో నైతిక విలువలతో పాటు క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి జవహర్‌ పేర్కొన్నారు. స్థానిక రామ్‌నగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రామనగర్‌ పాఠశాల అభివృద్ధికి చీమకుర్తి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కృషి చేసినట్లు తెలిపారు. మద్దిపాడు ఏఎంసి మాజీ ఛైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు పొందాలని అన్నారు. ఎంఈఓ కె శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా పనిచేస్తున్నాయని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలంకరించాయి. కార్యక్రమంలో జెసిఎస్‌ పట్టణ కన్వీనర్‌ మంచా హరికృష్ణ, కౌన్సిలర్లు సోమాశేషాద్రి, పొదిలి కాశయ్య, ఎస్‌ సుందరరామిరెడ్డి, మేకల యల్లయ్య, మంచా నితీష్‌, జి చినవెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు ఏ వీరారెడ్డి, ఎస్‌కె నసీమాబాను, శ్రీనివాసరావు, శ్రీదేవి, యూటిఎఫ్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌కె అక్బర్‌, చలువాది శ్రీనివాసరావు, ఏపిటిఎఫ్‌ నాయకులు జె యాకోబు, ఎస్‌టియు నాయకులు ఎస్‌కె ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

➡️