నేడు  ‘అనంత’ తెలుగు భాష వైభవ సదస్సు

Jan 9,2024 10:18

విలేకరులతో మాట్లాడుతున్న పి.విజయబాబు

          అనంతపురం : అనంతురంలో మంగళవారం నాడు జరగనున్న ‘అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సును విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తరఫున అనంతపురం నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో తెలుగు సాహితీమూర్తులను విశిష్ట స్థాయిలో పురస్కారాలు అందించి సత్కరిస్తున్నామన్నారు. తెలుగు భాషకు సేవ చేస్తున్న వారు అనేకమంది ఉన్నారన్నారు. అనంత జిల్లా సాహిత్యానికి చరిత్రాత్మక ప్రదేశమని, ప్రభుత్వం నుంచి ఏ ఇంతవరకు ఏ అవార్డు రానివారికి ఇప్పుడు సత్కరిస్తున్నట్లు చెప్పారు.. 10 మంది సాహితీస్రష్టలకు తెలుగు భాష సేవ జీవిత సాఫల్య పురస్కారాలతోనూ, 40 మంది తెలుగు భాష సేవా ప్రతిభ పురస్కారాలతోనూ, ఇంకా 40 మంది కవులు, కళాకారులను సత్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జయహో శ్రీకష్ణదేవరాయ నత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు తెలుగు భాషాభిమానులు, జిల్లా ప్రజలు తరలిరావాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభా కార్యక్రమం, అతిధుల ప్రసంగాలు, పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వరరెడ్డి, ఐఅండ్‌ పిఆర్‌ డిఐపిఆర్‌ఒ పి.గురుస్వామి శెట్టి, డిఈవో నాగరాజు పాల్గొన్నారు.

➡️