నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభం

నేటి నుంచి 'ఆడుదాం ఆంధ్ర' మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభం

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వార్డు స్థాయిలో విజయవంతంగా జరిగిన ”ఆడుదాం ఆంధ్ర” పోటీల్లో గెలుపొందిన వారితో మండల, మున్సిపల్‌ స్థాయి పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్ర’ మండల, మున్సిపల్‌స్థాయి పోటీలను విజయవంతం చేయడంలో భాగంగా మంగళవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ర్యాలీని కమిషనర్‌ అరుణ, చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య, సుధాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వార్డు స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయని, ఈ పోటీల్లో గెలుపొందిన వారితో మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. క్రీడల నిర్వహణకు సంబంధించి మైదానాలను సిద్ధం చేశామని, అన్ని క్రీడాజట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. క్రీడల విశిష్టతను తెలియజేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ‘ఆడదాం ఆంధ్ర’ క్రీడల్లో ఔత్సాహిక ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో సీఎంఎం గోపి, ఎంఈవో-2 మోహన్‌, పీడీలు, మహిళలు పాల్గొన్నారు. కార్వేటినగరం : ఆడుద్దాం.. ఆంధ్రా క్రీడలను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీవో మోహన్‌ మురళీ ఆధ్వర్యంలో ఆడుద్దాం.. ఆంధ్ర క్రీడలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంఈవోలు విజయ కుమార్‌, మనోజ్‌ కుమార్‌, ఈవో మణి, పీడీలు మురళీ కష్ణంరాజు, మాండవ్య, తిరుమలరాజు పాల్గొన్నారు. గంగవరం: మండలంలోని యూనివర్సల్‌ పాఠశాల గ్రౌండ్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఆడుదాం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీవో మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం విద్యార్థులకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. సోమల: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 10వ తేదీ బుధవారం నుంచి 20వ తేదీ వరకు మండలస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగరాజు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం నుండి బస్టాండ్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాధర నాయుడు, ఎంఈఓ శివరత్న, పంచాయతీ కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బంగారుపాళ్యం: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీపీ అమరావతి కోరారు. ఇన్చార్జ్‌ ఎంపీడీవో హరిప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. సింగల్‌ విండో చైర్మన్‌ దత్తిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నారే సోమశేఖర్‌, ఎంఈఓలు నాగేశ్వరరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. వెదురుకుప్పం: మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు నిర్వహించారు. మంగళవారం ఎంపీడీవో ప్రేమ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఉన్న పంచాయతీలలో గెలిచిన జట్లను ఫైనల్‌గా ఆడించేందుకు మండల కార్యాలయం ఆవరణం వెన్నుక భాగంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

➡️