నూతక్కి గ్రామంలో వైద్య శిబిరం – ప్రజాశక్తి కథనంతో వైద్యాధికారుల్లో కదలిక

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌విష జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్తులపై ప్రజాశక్తి పత్రికలో కథనం రావడంతో వైద్యాధికారులు స్పందించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం, నూతక్కి వారి కండ్రిగ గ్రామంలో చేజర్ల మండలం, చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ నవీన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. పరిశరాలు పరిశుభ్రంగా లేకపోవడ వల్ల దోమలు అధిక మవుతాయని వీటి వల్లే ఈ విష జ్వరాలు ప్రబలుతున్నాయని నవీన్‌ తెలిపారు. గ్రామం లో పారిశుధ్యం మెరుగుపరచాలని గ్రామస్తుల కు తెలిపామన్నారు. 15 రోజులుగా జ్వరాలు విజంభిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. జ్వరాలకు తోడు ఒళ్లు నొప్పులతో అల్లాడిపో తున్నామని వాపోయారు. మందులు వాడిన తగ్గడం లేదని వారు చెప్పారు.

➡️