నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలి

Mar 19,2024 23:41
ఇటీవల చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం సభకు

ప్రజాశక్తి – జగ్గంపేట

ఇటీవల చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో విఫలం అయిన పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళ వారం ఆయన ఓ ప్రకట నను విడుదల చేశారు. లక్షలాది మంది జనం ప్రజాగళం సభకు తరలి వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో బందోబస్తు కల్పించాల్సిన పోలీసు అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిం చారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా కొందరు పోలీసుల అధికారుల వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభకు లక్షలాదిగా ఆయా పార్టీల శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేశారని అన్నారు. కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వేలాది మంది సభ ప్రాంగణానికి చేరుకోలేక పోయారని అన్నారు. లక్షలాదిమంది ప్రజలు హాజరైన సభకు పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవ డంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. ప్రధాన మంత్రి సభలో క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత ఎవరిది? అధికారులను ఏర్పాటుచేసి, జనాన్ని నియంత్రాం చాల్సిన బాధ్యత సీనియర్‌ పోలీసు అధికారులకు లేదా? అని ప్రశ్నిం చారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వంతో పాటు అందులో పనిచేస్తున్న కొందరు అధికారులు ఉద్దేశ పూర్వకంగానే సభకు అడ్డంకులు సృష్టించేం దుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టిడిపి, జనసేన, బిజెపి నేతలు, కార్య కర్తలు సభను వ్రిజయవంతం చేశారని అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో జరిగిన అవినీతి, దోపిడీని పిఎం నరేంద్ర మోడీ కళ్లకు కట్టినట్లు వివరించారని అన్నారు. ఇప్పటికైనా కొందరు పోలీసు అధికారులు తమ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. సభకు అడ్డంకులు కలిగేలా వ్యవహరించిన పోలీసు అధికారులపై విచారించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆయన డిమాండ్‌ చేశారు.

➡️