నిమ్మకాయ మింగి చిన్నారి మతి

నిమ్మకాయ మింగి చిన్నారి మతి

చిన్నారి మృతదేహంపై పడి రోదిస్తున్న తండ్రి

ప్రజాశక్తి-పెద్దవడుగూరు

ఇంటి వద్దనే ఎంతో ఉత్సాహంగా ఆడుడుకుంటున్న చిన్నారిని ఓ నిమ్మకాయ రూపంలో చిదిమేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన వాలంటీరు సకీదీప, గోవిందరాజులు దంపతులకు ఏడేళ్ల తర్వాత జశ్విత (9నెలలు) పుట్టింది. ఎంతో అల్లారి ముద్దుగా చూసుకుంటున్న చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది. దీంతో తల్లిదండ్రులు వారి పనిలో నిమగమయ్యారు. ఈనేపథ్యంలో ఇంటి వరండాలో పడిన నిమ్మకాయను చిన్నారి నోట్లో పెట్టుకుంది. గమణించిన తల్లి సకీదీప చిన్నారి నోట్లో నిమ్మకాయను తీయబోయినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే చికిత్స నిమిత్తం పెద్దవడుగూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందున మెరుగైన వైద్యం కోసం పామిడి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారి మతదేహంపై పడి విలపించిన ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఏడేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ తమకు లేకుండా చేస్తివా దేవుడా అంటూ రోధించారు.

➡️