నవ సమాజ స్థాపనకు ఓటు వజ్రాయుధం

Mar 11,2024 21:00

ప్రజాశక్తి- బొబ్బిలి : నవ సమాజ స్థాపనకు ఓటుహక్కు వజ్రాయుధమని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. స్థానిక లోకబందు రెసిడెన్సీలో సోమవారం నా మొదటి ఓటు ఆంధ్రప్రదేశ్‌కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ప్రజాస్వా మ్యంలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించాలంటే రాజకీయాలు అవసరమన్నారు. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఉపాధి, వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. సమాజాన్ని బాగు చేసుకునేందుకు కష్టాలను తీర్చుకుని జీవితాలను బాగు చేసుకునేందుకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టిడిపి యూత్‌ వింగ్‌ కార్యదర్శి పి.తేజస్విని మాట్లాడుతూ రాష్ట్రానికి సరైన నాయకుడిని ఎన్నుకుంటే యువత, ప్రజలకు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. సామాజిక సేవ చేస్తున్న బేబినాయనకు మొదటి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతు ందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రొఫెషనల్‌ వింగ్‌ జోనల్‌ ఇంచార్జి ఆవాల సతీష్‌ కుమార్‌, టిడిపి నాయకులు, మొదటిసారి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు పాల్గొన్నారు.గంజాయిపై ఉక్కుపాదం మోపి నివారణరానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే గంజాయిపై ఉక్కుపాదం మోపి నివారిస్తామని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. కల్తీ మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు వల్ల యువత జీవితాలు నాశనం నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని యువకులు ప్రశ్నించగా కల్తీ మద్యం నివారిం చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ జూని యర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, రోడ్లు బాగు చేయాలని, తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించాలని కోరగా టిడిపి అధికారంలోకి వస్తే ఆయా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

➡️