నరసరావుపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా వాసుదేవారెడ్డి

పల్నాడు జిల్లా: నరసరావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా శనివారపు వాసుదేవారెడ్డి నియమితులయ్యారు. కొద్ది నెలల క్రితం అప్పటి మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.ఎ హనీఫ్‌ తన పదవీకాలం ముగియ నున్న దశలో ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాజీ నామా చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న సీనియర్‌ నాయకులు గజ్జల బ్రహ్మారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది నెలలుగా ఖాళీగా ఉన్న మార్కెట్‌ యార్డ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి విషయమై ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు నరసరావు పేట మండలంలోని ఉప్పలపాడుకు చెందిన వాసుదేవారెడ్డిని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్‌ చైర్‌పర్సన్‌ పులుసు అన్నపూర్ణమ్మ కోటేశ్వరరావు, డైరెక్టర్లుగా పి.రామయ్య, నక్కా వెంకట కోటేశ్వరరావు, బత్తుల పద్మలత రవివర్మ, షేక్‌ బిబి ఆశా, కుంభ శ్రీని వాసరావు, పెనుగొండ ప్రభాకర్‌, తడికమళ్ల చిన్న కోటేశ్వరరావు, బి.రామ నాగేశ్వరరావు నియమితు లయ్యారు. వాసుదేవరెడ్డి వైసిపి ఆవిర్భావం నుండి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి అనుచరునిగా ఉంటు న్నారు. నూతన చైర్మన్‌, వైస్‌చైర్‌పర్సన్‌, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని గురువారం ఆయన కార్యాలయం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్‌ యార్డ్‌ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు. వాసు దేవారెడ్డి మాట్లాడుతూ తనపట్ల నమ్మకంతో చైర్మన్‌ పదవిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రమాణస్వీకారం చేస్తా మన్నారు.

➡️