దీక్ష భగం చేసినా..తగ్గేదేలే..!అటవీ కార్మికుల సమస్య పరిష్కరించాలిరౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షంమరో ఏడుగురితో నిరవధిక దీక్ష కొనసాగింపు

దీక్ష భగం చేసినా..తగ్గేదేలే..!అటవీ కార్మికుల సమస్య పరిష్కరించాలిరౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షంమరో ఏడుగురితో నిరవధిక దీక్ష కొనసాగింపు

దీక్ష భగం చేసినా..తగ్గేదేలే..!అటవీ కార్మికుల సమస్య పరిష్కరించాలిరౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షంమరో ఏడుగురితో నిరవధిక దీక్ష కొనసాగింపుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ అటవీ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలను సోమవారం అర్ధరాత్రి పోలీసులు భగం చేయడంతో, ఏమాత్రం వెనకడుగు వేయకుండా అటవీ కార్మికులు దీక్షను కొనసాగించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి సహా, మరో ఎనిమిది మంది అటవీ కార్మికులను పోలీసులు బలవంతంగా వారి ఆరోగ్యం క్షీణించిందన్న సాకుతో అరెస్టు చేసి, రుయాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడే మరో ఏడుమంది అటవీ కార్మికులు దీక్షా శిబిరం ఖాళీ అవకుండానే పూలమాలలు ధరించి దీక్షను కొనసాగించారు. ఎంతమందిని అరెస్టు చేసినా సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ దీక్ష ఆపేది లేదని వెల్లడించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ నినదించారు. మంగళవారం వీరి దీక్షలకు అఖిలపక్షం సంఘీభావం ప్రకటించింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు మాట్లాడుతూ టిటిడి యాజమాన్యం చర్చలకు పిలిచి అర్ధరాత్రి దీక్షల్లో ఉన్నవారిని అరెస్టు చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఫారెస్టు కార్మికులకు టైంస్కేల్‌ వర్తింపజేస్తామని టిటిడి బోర్డు చేసిన తీర్మానం అమలు చేయకుండా, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా, టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఫారెస్టు కార్మికులు చేస్తున్న దీక్షకు సిపిఎం అండగా ఉంటుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఆర్‌పిఐ అధ్యక్షులు పి.అంజయ్య, ఎపి ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ ఫారెస్టు కార్మికులను విడగొట్టి కొంతమందిని పర్మినెంట్‌ చేసి, మరికొంతమందిని కార్పొరేషన్‌లో కలపడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుండా పోలీసులతో దీక్షను భగం చేయడాన్ని తప్పుబట్టారు. చిత్తూరు జిల్లా సిఐటియు జిల్లా నాయకులు చైతన్య, సురేంద్ర, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, టిఎన్‌టియుసి నాయకులు రెడ్డెప్పనాయుడు మాట్లాడుతూ ఫారెస్టు కార్మికుల జీవితాలతో టిటిడి చెలగాటమాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కారయదర్శి టి.సుబ్రమణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌,రైల్వే కాంట్రాక్టు వర్కర్స్‌ నేత శ్రీను, నాయకులు మునిరాజా, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఇఎస్‌ కుమార్‌, సిఐటియు నాయకులు ఆర్‌.లక్ష్మి, పి.బుజ్జి, చిన్నా, వాసు, తంజావూరు మురళి, తిరుపతి అన్నారావు సర్కిల్‌ స్టాండ్‌ నాయకులు కుమార్‌, శంకరయ్య పాల్గొన్నారు.

➡️