దరఖాస్తులు కుర్చీలకివ్వాల్సిందేనా.?

Dec 22,2023 23:22
దరఖాస్తులు కుర్చీలకివ్వాల్సిందేనా.?

ప్రజాశక్తి-వెదురుకుప్పం: ప్రజా ముంగిటికి ప్రభుత్వ సేవలు అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించింది. వివిద శాఖలను విభజించి సిబ్బందిని నియమి ంచింది. ఉద్దేశం మంచిదైనా సిబ్బంది నిర్లక్ష్య దోరణి పలువురి విమర్శలకు దారితీస్తోంది. సిబ్బంది గైర్హాజరు, పనిలో అలసత్వం, పని వేళల్లో అందు బాటులో లేకపోవడం వంటి సంఘటనలకు విమర్శ కుల వాదనకు బలం చేకూరుస్తోంది. గంగాధర నెల్లూరు నియోజ కవర్గం వెదురుకుప్పం మండలం జక్కిదొన సచివాల యంలో శుక్రవారం సిబ్బంది రాక ఖాళీ కుర్చీలు దర్శ నమిచ్చాయి. గంటావారిపల్లి, జక్కిదొన గ్రామాలకు కలిపి ఈ సచివాలయం ఏర్పాటైంది. అర్జీలతో సచివా లయాన్ని సందర్శించిన గ్రామస్తులకు ఖాళీ కుర్చీలు కనిపించడంతో ఇదేం తీరు.. అంటూ అసహనానికి లోనై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ పనులు, దినసరి కూలీలు పని మానుకొని ప్రభుత్వ పథకాలు, వివిద సర్టిఫికేట్‌లు పొందడానికి అర్జీలు తెచ్చినా వా రకి నిరాశ తప్పలేదు. సిబ్బంది ఒక్కరు కూడా సచి వాలయంలో లేకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు ఆర్భాటాలకే తప్ప గ్రామ పరిపాలనను గాడి పెట్టేందుకు ఉపయోగ పడలేదంటూ గ్రామస్తులు వాపోయారు. తెచ్చిన అర్జీలు కుర్చీలకు ఇవ్వాల్సిందేనా అంటూ మండిపడ్డారు.మహిళా పోలీస్‌ మాత్రమే విధుల్లో ఉన్నారు.. సిబ్బంది సచివాలయంలో లేని మాట వాస్తవమే. సిబ్బంది వివిద కారణాలతో సెలవులో ఉన్నారు. ప్రస్తుతం మహిళా పోలీస్‌ మాత్రమే అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మద్యాహ్న సమయంలో భోజనానికి వెళ్లి ఉండోచ్చు. – ప్రేమ్‌కుమార్‌, ఎంపీడీవో, వెదురుకుప్పం

➡️