తీర్పులో.. నారీమణులు

Apr 1,2024 22:06
తీర్పులో.. నారీమణులు

గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గ పునర్విభజన తరువాత అసెంబ్లీ స్థానాన్ని ఎస్సి రిజర్వుడ్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఎక్కడ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈనియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం, కార్వేటినగరం, శ్రీరంగరాజుపురం (ఎస్‌ఆర్‌ పురం) పాలసముద్రం, గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాలు ఉన్నాయి.. 35 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 17వ తేదీ ఓటర్ల జాబితా ప్రకారం 2,04,669 మంది ఓటర్లులో ఉన్నారు. వీరిలో పురుషులు 1,01,697 ఉండగా, మహిళలు 1,02,966 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు 1269 మంది ఉన్నారు. కాగా సర్వీస్‌ ఓటర్లు 475 మంది, పిడబ్ల్యూడి ఓటర్లు 3583 మంది, 18 సంవత్సరాలు నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 4641 మంది, సీనియర్‌ సిటిజెన్లు 2763 మంది ఉన్నారు.ప్రజాశక్తి- వెదురుకుప్పం తొలిసారిగా ఓటు హక్కు… నియోజకవర్గంలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని యువత 4,641 మంది ఉన్నారు. వీరంతా 18 నుండి 19 సంవత్సరాల మధ్య ఉన్నవారు. కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నవారు.పోలింగ్‌ కేంద్రాలు, మండలాల వారీగా, ఓటర్ల వివరాలు.. పెనుమూరు మండలంలో 42 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్లు 32,500 మంది. వీరిలో పురుషులు 16,176 మంది. మహిళలు 16,323 మంది. ట్రాన్స్‌ జెండర్‌ ఒకరు ఉన్నారు. ఈ మండలంలో 147 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వెదురుకుప్పం మండలంలో 40 పోలింగ్‌ కేంద్రాలు, మహిళలు 17,996 మంది, పురుషులు 18,132 మంది ఓటర్లు ఉన్నారు, ట్రాన్స్‌జెండర్స్‌ ముగ్గురు ఉన్నారు.136 మంది పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. కార్వేటినగరం మండలంలో 50 పోలింగ్‌ కేంద్రాలు, 17,250 మంది పురుష ఓటర్లు, 17,834 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 584 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. శ్రీరంగరాజపురం (ఎస్‌ఆర్‌ పురం) మండలంలో 35 పోలింగ్‌ కేంద్రాలు, 14,477 మంది పురుష ఓటర్లు, 14, 763 మంది మహిళా ఓటర్లు ఒక ట్రెండ్‌ జెండర్‌ ఓటు ఉంది. ఇక్కడా 256 మంది మహిళలే అధికంగా ఉన్నారు. గంగాధర నెల్లూరు మండలంలో 64 పోలింగ్‌ కేంద్రాలు, 26,861 మంది పురుషులు, 27,029 మంది మహిళలు ఉన్నారు. ఒక ట్రాన్స్‌ జెండర్‌ ఓటు ఉంది. 168 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పాలసముద్రం మండలంలో 23 పోలింగ్‌ కేంద్రాలు, 8,801 మంది పురుషులు. 9021 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మండలంలో 220 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఒక్క వెదురుకుప్పం మండలం మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ మహిళలు అధికంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో మహిళలు ఎవరికి ఓట్లు వేస్తే వారికే అధికారం దక్కనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన న్యాయనిర్ణేతలు వీరే కానున్నారు. దీంతో రాజకీయ పార్టీల నాయకులు మహిళా ఓటర్లను మెప్పించడానికి నానాపాట్లు పడుతున్నారు.

➡️