తిరుమల అంటే సెంటిమెంట్‌ : హీరో నాని

తిరుమల అంటే సెంటిమెంట్‌ : హీరో నాని

తిరుమల అంటే సెంటిమెంట్‌ : హీరో నానిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)చిన్నతనం నుండి తిరుమల శ్రీవారంటే తనకు సెంటిమెంటని, స్వామి వారిని దర్శించుకుంటే చాల ప్రశాంతంగా ఉంటూ కార్యకలాపాలు సాగుతాయని న్యాచురల్‌ స్టార్‌ నాని తెలిపారు. తిరుపతి రినెస్ట్‌ హోటల్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 7న ‘హారు నాన్న’ సినిమా విడుదల సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకుని, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. హారు నాన్న చిత్రంలో సెంటిమెంట్‌, ఎమోషనల్‌, ప్రేమ అన్ని అంశాలతో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అన్నారు. తొలిసారి వైర్‌ ఎంటర్టైన్మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మించారని, దర్శకుడు శౌర్యవ్‌ చాలా బాగా చిత్రీకరించారన్నారు. ఇందులో ఒక పాటను హీరో విక్రమ్‌ కుమారుడు పాడారన్నారు. మల్టీస్టారర్‌ సినిమాలకు మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానన్నారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి సినిమాలు చేసే అవకాశం వస్తే అంత కంటే అదష్టం ఉండదన్నారు.

➡️