తాడేపల్లి ఆఫీస్‌ నుండి ఫోన్‌ వచ్చింది.. వెళ్తున్నా..

మాట్లాడుతున్న జంగా కృష్ణమూర్తి
ప్రజాశక్తి – దాచేపల్లి :
గురజాల నియోజకవర్గం టిక్కెట్‌ అంశంలో వైసిపిలో నెలకొన్న పోటీ ముదురుతోంది. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని కాదని వైసిపి నాయకులు, కార్యకర్తల సమావేశం స్థానిక సిపిఐ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సిఎంగా జగన్‌ కావాలని కోరుతూ తాను వైసిపి ఆవిర్భవించిన తొలినాళ్లలోనే పాదయాత్ర చేశానని, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తనకు వైసిపి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీతో సరిపెట్టారని అన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అధిష్టాన అంగీకరిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే సమావేశం మధ్యలో ఉండంగానే ఆయనకు ఫోన్‌ రావడంతో సమావేశాన్ని ముగించి తాడేపల్లికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి కార్యాలయం నుండి తనకు ఫోన్‌ వచ్చిందని, వెళ్తున్నానని మైకులో ప్రకటించి మరీ వెళ్లారు.ప్రజాశక్తి – మాచర్లస్థానిక పంచాయితీరాజ్‌ అతిథి గృహంలో పల్నాడు జిల్లా బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశాని హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. గ్రామంలో ఎన్ని కులాలుంటే అన్ని కులాలకు సర్పంచ్‌ పదవి ఏడాదికొకరు చొప్పున కేటాయిస్తున్నారని, బడుగు, బలహీన వర్గాల నుండి నాయకులు ఎదిగేందుకు ఇది పెద్ద అవరోధంగా మారిందని అన్నారు. రాజకీయ పార్టీలు ఒక వ్యూహం ప్రకారం అట్టడుగు వర్గాలను ఎదగకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మదార్‌సాహెబ్‌, జి.వెంకటేశ్వర్లు, జి.రామక్రిష్ణారావు, అబ్రహం లింకన్‌, జె.వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️