తాగునీటి సమస్యను పరిష్కరించాలి : ఉగ్ర

ప్రజాశక్తి -కనిగిరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనిగిరి పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులకు గురవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ టిడిపి పట్టణ అధ్యక్షుడు తమ్మనేని శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ కనిగిరిలో గత వారం రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిచి పోయినట్లు తెలిపారు. దీంతో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వేసవి నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కమిషనర్‌ పివి.రంగారావుకు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కమిషనర్‌ మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️