టీమిండియా ఓటమి… హార్డ్‌ లే మాయాజాలం

Jan 28,2024 22:05 #Sports

తొలిటెస్ట్‌లో 28పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

7 వికెట్లతో రాణించిన ఇంగ్లండ్‌ కొత్త స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌ లే

హైదరాబాద్‌: ఉప్పల్‌ టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ జట్టు నిరద్దేశించిన 231పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు 202పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 28పరుగుల తేడాతో భారతజట్టును చిత్తుచేసింది. ఇంగ్లండ్‌ గెలుపులో ఓలీ పోప్‌(196; 278బంతుల్లో 21ఫోర్లు)కి తోడు బౌలింగ్‌లో అరంగేట్రం స్పిన్నర్‌ టామ్‌ హార్టీల్స ఏడు వికెట్లతో ఇంగ్లండ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడింయలో నాల్గోరోజైన ఆదివారం చివర్లో బుమ్రా (6 నాటౌట్‌), సిరాజ్‌ (12) భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేయడంతో టీమిండియా గెలుపుపై ఆశలు కలిగినా, హార్ట్‌ లే మళ్లీ బౌలింగ్‌ కు దిగడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. తొలి బంతికే సిరాజ్‌ స్టంపౌట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ కు తెరపడింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 39, కేఎల్‌ రాహుల్‌ 22, కేఎస్‌ భరత్‌ 28, రవిచంద్రన్‌ అశ్విన్‌ 28 పరుగులు చేశారు. కాగా, ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ లో ఇంగ్లండ్‌ జట్టు 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. దీంతో ఈ మైదానంలో ఓటమి ఎరుగని టీమిండియాకు తొలిసారి పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం.. తీరా విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సిన పరిస్థితి. ప్రత్యర్థి నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో అశ్విన్‌ (28) – శ్రీకర్‌ భరత్‌ (28) ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్‌ కావడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. అంతకుముందు రోహిత్‌ శర్మ (39) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. కేఎల్‌ రాహుల్‌ (22), అక్షర్‌ పటేల్‌ (17), శ్రేయస్‌ అయ్యర్‌ (13), యశస్వి జైస్వాల్‌ (15) ఎక్కువ సేపు నిలవలేదు. రవీంద్ర జడేజా (2), శుభ్‌మన్‌ గిల్‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. సిరాజ్‌ (12), బుమ్రా (6నాటౌట్‌) కూడా కాసేపు పోరాటంతో ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. టామ్‌ హార్ట్‌లే ఏడు.. రూట్‌, జాక్‌ లీచ్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పోప్‌కు లభించగా.. రెండో టెస్ట్‌ విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2నుంచి ప్రారంభం కానుంది.

స్కోరు వివరాలు…ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు- 246 ఆలౌట్‌

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు- 436 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు- 420 ఆలౌట్‌

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ స్కోరు- 202 ఆలౌట్‌

➡️