టివి టెక్నీషియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

  వినుకొండ : స్థానిక ఏనుగుపాలెం రోడ్డులోని మిర్చి యార్డ్‌ లో నియోజకవర్గ టివి టెక్నీషియన్‌ వెల్ఫేర్‌ అసో సియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నిక, ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు ముఖ్య అతిథులు గా విచ్చేశారు. ఆత్మీయ సమావేశం అనంతరం వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీవీ టెక్నీషియన్ల ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవీ టెక్నీషియన్స్‌ అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షులుగా గా దద్దాల ఆంజనేయులు, వైస్‌ ప్రెసిడెంట్‌ గా భాస్కర్‌, కార్యదర్శి గా సిహెచ్‌. చిన్న, జాయింట్‌ సెక్రటరీ గాఎమ్‌.శ్రీనివాస్‌, ట్రెజరర్‌ గా జయరావు లను ఎనుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో పాటు సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు.

➡️