జ్యోతి యర్రాజి జాతీయ రికార్డు

Feb 17,2024 22:20 #Sports

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

టెహ్రాన్‌: ఇక్కడ జరుగుతున్న ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజి 60మీ. హర్డిల్స్‌లో జాతీయ రికార్డును బ్రేక్‌ చేసింది. శనివారం జరిగిన మహిళల 60మీ. హార్డిల్స్‌ ఫైనల్లో యర్రాజి 8.12సెకన్లలో గమ్యానికి చేరి ఈ రికార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు యర్రాజి(8.22సెకన్లు)గా ఉంది. ఫైనల్లో యర్రాజి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. అసుక తెరడా(జపాన్‌ా8.21సెకన్లు), లూాలిాయు(హాంకాంగ్‌) 8.26సెకన్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. గత ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన 24ఏళ్ల జ్యోతి 100మీ. హార్డిల్స్‌లో బంగారు పతకాన్ని చేజిక్కించుకోగా.. హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లోనూ రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.

➡️