జవాన్లకు మా సినిమా అంకితం : వరణ్‌తేజ్‌

Feb 21,2024 08:30 #movie, #varun tej

‘తెలుగులో మొట్టమొదటి ఏరియల్‌ ఫిల్మ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌. చాలా కొత్తగా, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ కూర్చుని గూస్‌ బంప్స్‌ మూమెంట్స్‌ని ఎంజారు చేసే చాలా సీన్లు ఇందులో ఉన్నాయి. చాలా గర్వంఒగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్లకు ప్రేక్షకులు సెల్యూట్‌ కొడతారు. మన జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ధైర్య సాహసాలను మీ ముందుకు తీసుకురావటానికే ఈ సినిమా’ అని హీరో వరుణ్‌తేజ్‌ అన్నారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌, తెలుగులో రామ్‌చరణ్‌ లాంచ్‌చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ గ్రిప్పింగ్‌ ట్రైలర్‌కు ఇటీవల ఆవిష్కరించారు. ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వరుణ్‌తేజ్‌ మాట్లాడారు. హీరోయిన్‌ మానుషి చిల్లర్‌ తదితరులు పాల్గన్నారు. ఈ సినిమాకు దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందించారు. సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్దా నిర్మించారు. గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నందకుమార్‌ అబ్బినేని సహనిర్మాత. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది.

➡️