చీడివలసలో తాగునీటి ఎద్దడి

గెడ్డలో నీటిని తోడుతున్న మహిళలు

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ చీడీవలస గ్రామంలో దాహం కేకలతో పివిటీజీ ఆదిమజాతి గిరిజనులు తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గాను 2021 సంవత్సరంలో బోరు ఏర్పాటు చేశారు. అనంతరం కరెంటు మోటార్‌ బిగించి గ్రామంలో ఉన్న 50 కుటుంబాలకు ఇంటింటా కుళాయి ట్యాప్‌లు బిగించాల్సి ఉంది. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే కాంట్రాక్టర్‌ పనులు తెలిపి వేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఏర్పాటు చేసిన బోరుకు విద్యుత్‌ కరెంట్‌ మీటర్‌ బిగించి తాగునీటి సరఫరా చేయాలని ఆదిమజాతి గిరిజనులు కోరుతున్నారు.

➡️