చిలమత్తూరులో మంత్రి పర్యటన

Jan 12,2024 21:06

శెట్టిపల్లిలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

     చిలమత్తూరు : చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, దేమకేతేపల్లి, టేకులోడు, శెట్టిపల్లి, కోడూరు, కొడికొండ పంచాయతీలో వైసిపి రాయలసీమ ఇన్‌ఛార్జి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి శుక్రవారం పర్యటించారు. పంచాయతీ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రసంగించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి పర్యటన సందర్భంగా ఆయా గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా నాయకులు అడ్డుకున్నారు. గ్రామాలకు రోడ్డు వేయాలని వినతిపత్రం ఇద్దామని వెళ్లిన వారిని స్థానిక నేతలు కలవనివ్వలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అసంతప్తి వ్యక్తం చేశారు. ‘మీకు చెప్పినా పరిష్కరించరు.. పెద్దాయన దష్టికీ తీసుకెళ్లనివ్వరు.. ఇలా అయితే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి’.. అంటూ గ్రామస్తులు నాయకులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నియోజక ఇన్‌ఛార్జి దీపిక, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, జడ్పీ ఛైర్మన్‌ గిరిజమ్మ, ఆగ్రోఛైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌, మధుమతిరెడ్డి, మండల కన్వినర్‌ రాజారెడ్డి, ఎంపిపి పురుషోత్తమరెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి, నాగరాజు సర్పంచులు తిరుమలేష్‌, చామంతి, మురళీ, జనార్థన్‌ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️