గ్రామీణ డాక్‌ సేవక్‌ల సమస్యలను వెంటనే పరిష్కరించండి

Dec 14,2023 23:57 #macherla, #postal, #sevaks

మాచర్ల్ల: క్షేత్ర స్ధాయిలో పోస్టల్‌ సేవలు అందించే గ్రామీణ డాక్‌(పోస్టల్‌) సేవక్స్‌ సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలోనే పరిష్కారం చేయాలని సంఘ సర్కిల్‌ కార్యదర్శి ఎస్‌.యోగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 7వ వేతన కమిటీలో అమలు కాని అంశాలపై ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న నేపథ్యంలో జిడిఎస్‌లు చేపట్టిన నిరవధిక సమ్మె మాచర్ల పట్టణంలో కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో యోగేశ్వరరావు మాట్లా డుతూ జిడి ఎస్‌లకు సర్వెంట్‌ హోదా ఇచ్చి, వారికి 8 గంటల పని గం టలను అమలు చేయాలన్నారు. టార్గెట్స్‌, మేళాల రూపంలో జిడిఎస్‌ ఉద్యోగులపై వేధింపులను ఆపివేయా లన్నారు. డివిజన్‌ కార్యదర్శి పి ఆజరుకుమార్‌ మాట్లాడుతూ జిడిఎస్‌ ఉద్యోగులకు 12, 24, 36 అదనపు సర్వీసు ఇంక్రిమెంట్లు ఇచ్చి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ను రూ.5 లక్షలకు, గ్రాట్యుటీ రూ.5 లక్షలకు పెంచాలన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కోనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బ్రాంచీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌డి రామారావు, ఎస్‌ఎల్‌ చెన్నకేశవరావు, నాయకులు పి సుష్మ, ఎస్‌ శ్రీజ, సిహెచ్‌ లావణ్య, ఎ అనుషా, ఎస్‌ నవీనా, పి శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.

➡️