గొంతెండుతోంది..!

కడప, అన్నమయ్య జిల్లాల్లో దాహార్తి దావానలంగా విస్తరిస్తోంది. కడప కార్పొరేషన్‌ ఐదు రోజులకు, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఎనిమిది రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తుండడం దాహార్తి తీవ్రతకు అద్దం పడుతోంది. కడప జిల్లాలోని ఆరు, అన్నమయ్య జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పులివెందుల, ప్రొద్దుటూరు మినహా మిగిలిన మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కడప జిల్లా ఆర్‌డబ్య్లుఎస్‌ ఇంజినీరింగ్‌ యంత్రాంగం ఏప్రిల్‌ నుంచి జూన్‌ నాటికి జిల్లాలోని 264 హ్యాబిటేషన్లలో ట్రాన్స్‌పోర్టేషన్‌, బోర్ల ఫ్లస్సింగ్‌, డీపెనింగ్‌ వంటి ఇతర అవసరాల మేరకు అందజేసిన రూ.7.75 కోట్లతో కూడిన ప్రతిపాదనలకు ఆమోదం లభించని నేపథ్యం ఆందో ళన కలిగిస్తోంది. ప్రజాశక్తి – కడప ప్రతినిధికడప, అన్నమయ్య జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. కడప కార్పొరేషన్‌లో ఐదు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల కిందట కడప కార్పొరేషన్‌ కమిషనర్‌ తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించి, గండికోట నుంచి పెన్నా నదికి రెండు టిఎంసిల విడుదలకు చొరవ తీసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవని నేపథ్యంలో పెన్నానదికి విడుదల చేసిన రెండు టిఎం సిల నీరు కడప దరిదాపులకు చేరని నేపథ్యం తాగునీటి ఎద్దడి తీవ్ర తను తెలియజేస్తోంది. కడప నగర మధ్య భాగంలోని నాగరాజుపేట మొదలుకుని శివారు ప్రాంతమైన అక్కాయపల్లి వరకు తాగునీటి ఎద్దడి తీవ్రత విస్తరించింది. అక్కాయపల్లి ప్రాంతంలో ట్యాంకరు నీటిని రూ.600 చొప్పున కొనుగోలు చేసుకుని సంపుల్లో నిల్వ చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. ‘అన్నమయ్య’లో దాహార్తి కేకలు అన్నమయ్య జిల్లాలో దాహార్తి కేకలు మిన్నం టాయి. వెలిగల్లు రిజర్వాయర్‌ నుంచి రాయచోటి జిల్లా కేంద్రా నికి తాగునీటిని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్‌ ప్రారంభం కావడంతో నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజులకు ఒకసారి తాగు నీటిని సరఫరా చేస్తుండడం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది. రాయచోటి మండలంలోని కామా యకుంట హరిజనవాడలో తాగునీటి ఎద్దడి నెలకొనడంతో ఇటీవల కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేయాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లా అధికార యంత్రాంగం స్పం దించిన దాఖలాల్లేవు. జిల్లా వ్యాప్తంగా రాయచోటి, గాలివీడు, రామాపురం, చిన్నమండెం, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి, సుండుపల్లి, తంబళ్లపల్లి, బి.కొత్తకోట మండలాల్లో తాగునీటి సమస్య తాండవం చేస్తోంది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాలు దాహార్తి ముంగిట నిలవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చుట్టుముట్టిన తాగునీటి ఎద్దడి జిల్లాలో 36 మండలాలు ఉన్నాయి. 29 మండలాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. 12 మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. జమ్మలమడుగు, కొం డాపురం, మైలవరం, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్‌, చాపాడు, కలసపాడు, పోరుమామిళ్ల, గోపవరం, బి.కోడూరు, అట్లూరు, సికె దిన్నె, దువ్వూరు, వేంపల్లి మండలాల్లో ప్రమా దకర పరస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా లో తొమ్మిది మండలాల్లో తాగునీటి ఎద్దడి తాండవం చేస్తోంది.ట్రాన్స్‌పోర్టేషన్‌కు లభించని అనుమతి! రూ.7.75 కోట్లతో ఆర్‌డబ్ల్యుఎస్‌ యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. కడపలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ నాటికి 264 హ్యాబిటేషన్లలో ట్రాన్స్‌ పోర్టేషన్‌, ఫ్లసింగ్‌, డీపెనింగ్‌ అవసరాల్ని అంచనా వేసింది. ఇం దులో 33 హ్యా బ్స్‌లో హైరింగ్‌కు రూ.15.90 లక్షలు, 83 హాబ్స్‌లో ఫ్లస్సింగ్‌, డీపె నింగ్‌కు రూ.1.20 కోట్లు విడుదల కోసం నిరీక్షిస్తోంది. నిధులు ఆలస్యమయ్యేకొద్దీ తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చనుంది. గ్రామ పంచాయతీ ఫండ్స్‌ను ఉపయోగించుకుని తాగునీటి ఎద్దడిని తాత్కాలికంగా ఎదుర్కోవాలని కోరుతోంది. ఆర్‌డబ్ల్యుఎస్‌ ప్రతిపాదనలకు అనుమతి లభించని నేపథ్యంలో ట్రాన్స్‌పోర్టేషన్‌పై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేని దుస్థితి దాపురించింది. నెలాఖరు వరకు నాన్చివేత కొనసాగితే మరింత ఎద్దడికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.డ్రౌట్‌సెల్‌కు ఫిర్యాదుల పరంపరకడప జిల్లా డ్రౌట్‌సెల్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తీవ్రత కలిగిన సదరు 12 మండలాల నుంచి డ్రౌట్‌సెల్‌కు 112 ఫిర్యాదులు అందడం తీవ్రతకు అద్దం పడు తోంది. అత్యధికంగా జమ్మలమడుగులో 12, కలసపాడులో తొమ్మిది, కొండాపురంలో ఎని మిది, మైలవరంలో ఎనిమిది, దువ్వూరులో ఏడు, మైదుకూరులో ఆరు, సిద్ధవటంలో ఆరు, పెండ్లిమర్రి ఆరు చొప్పున ఫిర్యాదుల పరంపర కొనసా గుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

➡️