గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

Mar 26,2024 21:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : గజపతినగరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఫిజికల్‌ సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కేతిరెడ్డి వెంకటరమణ మంగళ వారం గుండెపోటుతో తన నివాసంలో మృతి చెందారు. విజయనగరం లోని ఉడా కాలనీ ఫేజ్‌ 1లో నివాసముంటున్న ఆయన టెన్త్‌ పరీక్షల నేపథ్యంలో స్పాట్‌ కేంద్రం ప్రభుత్వ బాలికల హైస్కూలులో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు బయలుదేరుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు 108కు ఫోన్‌ చేసి ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యలు అప్పటికే ఆయన మృతి చెందినలు తెలిపారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె దుర్గాపూన్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ చదువుతుండగా, రెండో కుమార్తె విశాఖలో ఇంటర్‌ చదువుతోంది. ఆయన భార్య ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

➡️