క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిద్దాం

Dec 23,2023 23:18
క్రీడాకారుల్లోని ప్రతిభను

ప్రజాశక్తి – కాకినాడ

క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్వ హిస్తోన్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను పటిష్టవం తమైన ప్రణాళికతో నిర్వహిం చాలని జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియ అధికారులకు పిలుపునిచ్చారు. స్థానిక రాజా ట్యాంక్‌ పార్కు నుంచి ఆనందభారతి గ్రౌండ్స్‌ వరకు శనివారం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని జెసి ఇలాక్కియా, అర్బన్‌ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసిం హారావు, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లా డుతూ ఈ నెల 26వ తేదీ నుంచి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల్లో సచివాలయ పరిధి నుంచి పోటీలు నిర్వహించి వీటిలో ఉత్తమ ప్రతిభ కన బరిచిన వారిని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. ద్వారంపూడి చంద్రశేఖ రెడ్డి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా పేరిట సిఎం జగన్‌ ప్రతిభ కల క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎఎంసి ఛైర్మన్‌ పి.వెంకటలక్ష్మి, జిల్లా ఐటీ సెల్‌ ఛైర్మన్‌బి.కృష్ణప్రియ, మున్సిపల్‌ కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిసి కోన శ్రీనివాస్‌, మేనేజర్‌ కె.సత్యనారాయణ, టిపిఆర్‌ఒ ఎం.కృష్ణమోహన్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్‌, అన్నవరం ట్రస్ట్‌బోర్డు సభ్యులు కె.భామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️