క్రీడలతో కీర్తి ప్రతిష్టలు

ఆయుర్వేద వనమూలిక వైద్యులు జమాల్‌ఖాన్‌

ఆయుర్వేద వనమూలిక వైద్యులు జమాల్‌ ఖాన్‌

ప్రజాశక్తి.- చింతూరు: క్రీడల్లో రాణించి కీర్తి ప్రతిష్టలు సాధించాలని, ఆటల్లోనే ఆరోగ్యం దాగి ఉందని ప్రముఖ ఆయుర్వేద వనమూలిక వైద్యులు జమాల్‌ఖాన్‌ అన్నారు. ఆదివారం సకీనా మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి యువత దురలావట్లకు లోనూ అటు సమాజానికి, ఇటు కుటుంబానికి ఇబ్బందికరంగా మారడం విచారకరమన్నారు. బాల్యం నుంచి ఆటలకు దూరమై, పిల్లల్లో ఆరోగ్యసమస్యలు తలెత్తడంతోపాటు ఆయుష్షును కూడా కోల్పోతున్నారన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించి, క్రీడాస్ఫూర్తితో వ్యక్తిగతంగా తనకు అటు గ్రామానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన ఆనందకరమైన భావితరాలను అందించాల్సిన కనీస బాధ్యత నేటితరంపై ఉందన్నారు. తన వంతు సాయంగా యువతకు క్రీడాసామగ్రి, ఆర్థికసాయం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అమల, చింతూరు ఎస్‌ఐ శ్రీనివాస్‌. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ అలీ. సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌. ఎర్రంశెట్టి శ్రీనివాసరావు. తెలుగుదేశం నాయకులు ఎండీ.జహంగీర్‌. మల్లెల్లి వెంకటేశ్వరరావు. వైసిపి నాయకులు రామలింగారెడ్డి. జనసేన మండలాధ్యక్షులు మడివి రాజు, షకీనా సన్స్‌ అక్బర్‌. శోకత్‌ అలీ. హసన్‌ అలీపాల్గొన్నారు.

క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న జమాల్‌ఖాన్‌

➡️