క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం

Dec 14,2023 22:39

మోడల్‌ టెస్ట్‌ పేపర్స్‌ పుస్తకాలను ఆవిష్కరిస్తున్న కమిషనర్‌, జయచంద్రారెడ్డి, తదితరులు

                   ధర్మవరం టౌన్‌ : క్రమశిక్షణతో కూడిన విద్య మంచి భవిష్యత్తుకు పునాది వేస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల ఉపయోగాలతో ముద్రించిన ఎస్‌ఎస్‌సి 2024 మోడల్‌ టెస్ట్‌ పేపర్లను స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ బండి శేషన్నతో పాటు ఎంఇఒలు రాజేశ్వరి దేవి, గోపాల్‌ నాయక్‌, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం 25 సంవత్సరాలు అనుభవం గల యుటిఎఫ్‌ ఉపాధ్యాయులతో రూపొందించిన ఈ మోడల్‌ పేపర్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ఆడిట్‌ కమిటీ మెంబర్‌ రామకృష్ణనాయక్‌, పట్టణ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు హరికృష్ణ, సాయి గణేష్‌, యుటిఎఫ్‌ జిల్లా మున్సిపల్‌ కన్వీనర్‌ బిల్లే రామాంజనేయులు, స్థానిక నాయకులు నాగేంద్ర కుమార్‌, రాంప్రసాద్‌, రామాంజనేయులు, ఆదిశేషు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️