కొడాలి నాని అనుచరుడి కారుపై దాడి

Mar 20,2024 16:41 #car, #kodali nani

ప్రజాశక్తి-గుడివాడ : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్‌ కారుపై అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ చోరగుడి రవికాంత్‌ దాడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం శశిభూషణ్‌ ఇందిరానగర్‌ కాలనీలోని మాజీ కౌన్సిలర్‌ బూసి ప్రకాష్‌ ఇంటికి వెళ్లారు. వార్డులో కొనసాగుతున్న ప్రచారంపై చర్చించారు. ఈ క్రమంలో రవికాంత్‌ కారుపై కర్రతో దాడి చేసి పరారయ్యాడు. డ్రైవర్‌ రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️