కేజ్రీవాల్‌ అరెస్టు దారుణం

కేజ్రీవాల్‌ అరెస్టు దారుణం

కేజ్రీవాల్‌ అరెస్టు దారుణంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో కేజ్రీవాల్‌ అరెస్టు కేంద్ర ప్రభుత్వ లౌకిక ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కే చర్య.. ఎలక్ట్రోరల్‌ బాండ్లు కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా కేజ్రీవాల్‌ అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టును పలు పార్టీలు ఖండించాయి. ఎలక్ట్రోరల్‌ బాండ్లు పక్కదారి పట్టించేందుకే : వి.నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి బిజెపి ఎలక్ట్రోరల్‌ బాండ్ల కుంభకోణాన్ని ప్రతిపక్షాలు బయట పెట్టడంతో పక్కదారి మళ్లించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఇది అప్రజాస్వామిక చర్య. ఈ దుర్మార్గాన్ని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఖండించకపోవడం ప్రజాస్వామ్యానికే మచ్చ. ఎన్నికల వేళ దేశ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెబుతారు.ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే : నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రతిపక్షాల అరెస్టులతో, ఈడీ దాడులతో భయపెట్టేందుకే బిజెపి కుట్ర పన్నుతోంది. ఎన్నికల్లో బిజెపి అక్రమాలు, అవినీతిని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్నికల్లో ఓటు రూపంలో ఆ పార్టీకి బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్‌ అరెస్టును కాంగ్రెస్‌ ఖండిస్తోంది.బిజెపి పాలిత ప్రాంతాల్లో దాడులెక్కడీ : పి.అంజయ్య, ఆర్‌పిఐ బిజెపి పాలిత ప్రాంతాల్లో అవినీతి అక్రమాలు జరగలేదా? తమకు లొంగని ప్రాంతీయ పార్టీలపై కక్షగట్టి దాడులు చేయడం శోచనీయం. లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా బిజెపి ఆగడాలను అడ్డుకోకపోతే ఈ దేశ భవిష్యత్‌ సర్వనాశనం అవుతుంది.మరీ దారుణం : చిన్నం పెంచలయ్య, సిపిఐ కేజ్రీవాల్‌ అరెస్టు మరీ దారుణం. ఓ ముఖ్యమంత్రిని సైతం మోడీ ప్రభుత్వం వదలడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించినా ఇంకా ప్రభుత్వ హుకుం ఏంటి? ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులు బిజెపి ఆగడాలను ప్రచారం చేసి జనాన్ని చైతన్యవంతులను చేస్తున్నారనే ఇలాంటి చర్యలు. ఇండియా కూటమిని ఎదుర్కోలేకే : చింతామోహన్‌, కేంద్ర మాజీ మంత్రి ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఇండియా కూటమిని ఎదుర్కొనే శక్తి లేక బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి కేజ్రీవాలను అరెస్టు చేయించింది. కేజ్రీవాల్‌ అరెస్టులో ప్రభుత్వ యంత్రాంగం వేగంగా కదిలింది. మిగిలిన ముఖ్యమంత్రుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బిజెపి ఎన్ని కుతంత్రాలు పన్నినా ఇండియా కూటమి విజయం ఖాయం.

➡️