కాశినాయన ఆలయాన్ని కూల్చొద్

దుఅడ్డుకున్న స్థానికులు
వెనుదిరిగిన అధికారులు
ప్రజాశక్తి-కాశినాయన
జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశినాయన ఆలయాన్ని పడగొట్టవద్దని ఆర్‌డిఒ, పోలీసు, అటవీశాఖ అధికారులకు ప్రజలు, వైసిపి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాధరెడ్డి కోరారు. సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు బద్వేల్‌ ఆర్‌డిఒ పోలీస్‌ అధికారులు కాశినాయన జ్యోతి క్షేత్రానికి వెళ్లారు. ఆలయానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో నిర్మాణపు పనులు చేయవద్దని, నిర్మాణాలు తొలగించాలని తమకు ఉత్తర్వులు వచ్చాయని అధికారులు చెప్పారు. అక్కడ ఉన్న ఆలయాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో ఇంతలో ఆలయ కమిటీ, విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకున్నారు. అధికారులకు రెండు చేతులు జోడించి తమ విన్నపాన్ని ఆలకించి ఆలయంజోలికి రావద్దని మొరపెట్టుకున్నారు. డిఎఫ్‌ఒ సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చామని, అనుమతులు లేకపోవడం వల్ల ఆలయపు నిర్మాణ పనులు చేయవద్దని చెప్పారు. అవసరమైతే పైస్థాయికి వెళ్లి అనుమతులు తెచ్చుకోవాలన్నారు. స్పందించిన విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ అనుమతికి సంబంధించిన ఫైలు ఎంపీ అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు ఫైలు వెళ్లిందని, రేపో, మాపో అనుమతి వస్తుందని ఆశపడ్డామని, ఇంతలోనే అధికారులు రావడం ఆశ్చర్యానికి గురవుతున్నామని తెలిపారు. దయచేసి ఆలయం జోలికి రావద్దని, త్వరలోనే ఆలయానికి అనుమతి తెచ్చుకుంటామని, కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల విన్నపాలకు అధికారులు వెనుతిరగక తప్పలేదు. కార్యక్రమంలో సబ్‌ డి ఎఫ్‌ సుధాకర్‌, ఆర్‌డిఒ వెంకటరమణ, ఎఫ్‌ఆర్‌ఒ ప్రణీతరావు, తాసిల్దార్‌ వి. ఎన్‌. వి. ఆర్‌ కష్ణ, ఎస్‌ఐ నాగమురళి, ఎఫ్‌ఎస్‌ఒ రమణయ్య ఎఫ్‌బిఒ కరుణాకర్‌, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు

➡️