కాలుష్యం నుంచి విముక్తి కల్పించండి

Feb 9,2024 20:39

 ప్రజాశక్తి – పూసపాటిరేగ  : సిపి ఆక్వా పరిశ్రమ కాలుష్యం నుంచి తమకు విముక్తి కల్పించాలని మండలంలోని చోడవరం గ్రామస్తులు మాజీ సర్పంచి నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపిడిఒ రాధిక, తహశీల్దార్‌ ప్రవళ్లికకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ వల్ల తమ ప్రాంతంలో గాలి, నీరు, భూములు కలుషితం అయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే కాలుష్యం నుంచి తమను కాపాడాలని కోరారు. పరిశ్రమలో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. తమ గ్రామంలో కంపెనీ పెట్టి తమకు ఉపాధి లేకుండా చేసే పరిశ్రమకు తామెందుకు సహకరించాలని ప్రశ్నించారు. సమస్యలను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు.

➡️