కాలువ పైనే రెండు అంతస్తుల భవనంనిద్రావస్థలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

కాలువ పైనే రెండు అంతస్తుల భవనంనిద్రావస్థలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

కాలువ పైనే రెండు అంతస్తుల భవనంనిద్రావస్థలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ తిరుపతి నగరపాలక టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకుని ఉంటారన్న విమర్శలున్నాయి.. మరికొన్ని సందర్భాల్లో డబ్బులు కావాలంటే అక్రమ కట్టడాలు కూల్చకుండా వదిలేస్తారు. తిరుపతి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఈ విధానం పరిపాటిగా మారింది. ప్లానింగ్‌ సిబ్బంది చేరడంతో టౌన్‌ ప్లానింగ్‌ విచ్చలవిడిగా అక్రమకట్టడాలను ప్రోత్సహించే వారి దగ్గర పెద్దఎత్తున నగదును తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఏసీబీ దాడులు చేసినా టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో తమను ఎవరు ఏమి చేసుకోలేరనేది ధీమాతో ఉంటున్నారు. నగర పాలక సంస్థ 43వ డివిజన్‌లోని దోబి ఘాట్‌ పక్కనే ఉన్న మురుగునీటి కాలవపైనే ఫిల్లర్లు వేసి మరీ రెండు అంతస్తుల భవనం నిర్మించేశారు. ఇంత జరుగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎందుకు కళ్లు మూసుకున్నారో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మురుగు వెళ్లడానికి నిర్మించిన కాలువల్లో ఫిల్లర్లు వేసి మరీ భవనాలు కడుతుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఏం చేస్తున్నారని ఆ వార్డు ప్రజలు అడుగుతున్నారు. వర్షాకాలంలో మురుగునీటి కాలవలు ఆక్రమణలు గురికావడంతో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి, 43వ డివిజన్లో కాలువ పైనే ఇల్లు నిర్మించిన ఘనుడు ఎంతకు తెగించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. నగరంలో కాలువలు కుచింకుపోవడానికి కారణం కబ్జాదారుల సంఖ్య పెరగడం, ఆక్రమ కట్టడాల నిర్మాణమే. తిరుపతి నగరపాలక టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఈ శాఖను ఎందుకు ఏర్పాటు చేశారో తెలీడం లేదు కానీ, లంచాలు ఇస్తే కాలువను కూడా పూడ్చి భవనాలు నిర్మిస్తున్న సంఘటనలు తిరుపతి నగరంలో కోకో కొల్లాలుగా ఉన్నాయి. కమిషనర్‌ స్పందించి ఈ కట్టడంపై చర్యలు తీసుకోకపోతే వర్షాకాలంలో వర్షపు నీరు ఉధతిలో ఈ భవనం కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తొత్తుగా వ్యవహరిస్తున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులను వెంటనే బదిలీ చేయాలని లేదంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాగే ఉంటే తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పక్కనే ఉన్న కాలువను కూడా ఆక్రమించి భవనం నిర్మించేస్తారు ఏమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి: సిపిఎం మురుగునీటి కాలువను ఆక్రమించి కాలువలోనే ఫిల్లర్లు వేసి ఇళ్లు కటిని భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కబ్జాలు మితిమీరిపోతున్నాయని, కాలువల సైతం వదిలిపెట్టడం లేదని అన్నారు. నగరంలోని 43వ డివిజన్‌ పరిధిలో ధోబి ఘాట్‌ పక్కన ఉన్న పెద్దకాలువపై ఇల్లు నిర్మాణం చేసుకొని కాపురం ఉంటున్న మున్సిపల్‌ అధికారుల కనబడడం లేదా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీకి చెందిన స్థలంలో ఒక అడుగు స్థలాన్ని ఎవరు ఆక్రమించినా వారిపై చర్యలు తీసుకునే మున్సిపల్‌ యంత్రాంగం రెవెన్యూ అధికారులు నేడు మాల్వాడి గుండం నుండి నీరు వచ్చేటటువంటి అతిపెద్ద కాలువ ఆక్రమణకు గురై భవనం ఏర్పాటు చేసుకుని ఆఇంటిలో కాపురం ఉంటుంటే అధికారులకు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. ఇదంతా చూస్తుంటే అధికారులు కూడా మామూలు మత్తులో పడిపోయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భారీ వర్షాలు వచ్చేటప్పుడు ఆ కాలవకుండానే కఫిలతీర్థం జలపాతం నుండి నీరు దిగువకు వెళ్ళబడుతుంది. అటువంటి కాలువలను సైతం కాపాడులేని పరిస్థితుల్లో మున్సిపల్‌ అధికారులు ఉన్నారంటే మీరు ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ అధికారులు రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన హెచ్చరించారు.

➡️