కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం

Jan 10,2024 20:32

నందవరంలో చెక్కు అందిస్తున్న భువనేశ్వరి

– నారా భువనేశ్వరి
– రూ.3 లక్షల చొప్పున చెక్కుల అందజేత
ప్రజాశక్తి – గోనెగండ్ల
టిడిపి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కొద్ది నెలల క్రితం చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి, జైల్లో నిర్బంధించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసే ‘నిజం గెలవాలి’ కార్యక్రమం చేపడుతున్నారు. బుధవారం గోనెగండ్ల మండలంలో కొనసాగింది. చంద్రబాబు నాయుడును జైల్లో నిర్బంధించిన సమయంలో మండలంలోని బి.అగ్రహారం గ్రామానికి చెందిన సుధాకర్‌ నాయుడు, అల్వాల గ్రామానికి చెందిన ఈరన్న, ఎర్రబాడు గ్రామానికి చెందిన కౌలుట్లయ్య మృతి చెందారు. ‘నిజం గెలవాలి’ ద్వారా వీరిని పరామర్శించేందుకు భువనేశ్వరి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీ.జయ నాగేశ్వర రెడ్డితో కలిసి ముందుగా బి.అగ్రహారం గ్రామంలోని సుధాకర్‌ నాయుడు ఇంటికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మృతుని భార్య, కుమారులతో మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వస్తే అండగా ఉంటామని భరోసానిస్తూ మృతుని భార్య రాధమ్మకుకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం అల్వాల గ్రామానికి చేరుకొని ఆరేకంటి ఈరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మృతుని భార్యతో మాట్లాడి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. చివరగా ఎర్రబాడు గ్రామంలో మృతి చెందిన కౌలుట్లయ్య ఇంటికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, టిడిపి మహిళా నేతలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, పంచుమర్తి అనురాధ, గుడిసె ఆది కృష్ణమ్మ, టిడిపి జిల్లా మహిళా నాయకులు ముంతాజ్‌ బేగం, టిడిపి మండల నాయకులు నజీర్‌ సాహెబ్‌, తిరుపతయ్య నాయుడు, రామాంజనేయులు, బేతాళ బడేసాబ్‌, గోనెగండ్ల సర్పంచి హైమావతి, అల్వాల సర్పంచి బాష, అనంత రెడ్డి, రమేష్‌ నాయుడు, రంగస్వామి నాయుడు, పూజారి చంద్ర, అడ్వకేట్‌ వెంకటేశ్వర్లు, నూర్‌ అహ్మద్‌, మదీన, ఫక్రుద్దీన్‌, భారతం రహమతుల్లా, చిన్ననేలటూరు నాగన్న, గాజులదిన్నె సంజన్న, చంద్ర, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు నాగరాజు, రమేష్‌ నాయుడు పాల్గొన్నారు. నందవరం మండలంలోని మాచాపురం, ముగతి గ్రామాల్లో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మాచాపురం గ్రామానికి చెందిన కొండా హనుమంతు, ముగతి గ్రామానికి చెందిన హరిజన నాగరాజు గుండెపోటుకు గురై మృతి చెందారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును అందించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ అనురాధ, మాజీ జడ్‌పి వైస్‌ ఛైర్మన్‌ పుష్పవతి, టిడిపి నాయకులు ఈరన్న గౌడ్‌, నాగరాజు గౌడ్‌, మాధవరావు దేశాయి, బండే గురుస్వామి, గురురాజు దేశాయి, ఖాసీం వలీ, రైస్‌ మిల్‌ నారాయణ రెడ్డి, ధర్మపురం గోపాల్‌, గజేంద్ర రెడ్డి, దావీదు, బాలరాజు, శ్రీనివాస్‌ రెడ్డి, భార్గవ్‌, పరశురాముడు, ఆదిశేషు, పీర్‌ సాబ్‌ పాల్గొన్నారు.

➡️