కార్మికుల అభ్యున్నతికి పెదరాజారావు కృషి

పెదరాజారావు సంతాప సభలో మాట్లాడుతున్న వై.రాధాకృష్ణ

చిలకలూరిపేట: ఐఎల్‌టిడి, ఇతర కంపెనీలలో కార్మికుల కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తుల్లో సాతులూరి పెద రాజారావు ముఖ్యులని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అన్నారు. స్థానిక తూర్పు మాలపల్లెలో చంద్రమౌళి పార్కులో ఆదివారం సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిం చారు. రాధాకృష్ణ మాట్లాడుతూ రాజారావు ఆశయాలకు అను గుణంగా నడవాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఐక్య పోరాటాలు విజయాలు సాధించాయని అన్నారు. సిఎఎ నిబంధనలు చూస్తే కేవలం ముస్లింలకు పౌరసత్వాన్ని కల్పించమని చెబుతున్నారని, ఒక మతం వారిపై మరో మతం వారితో విద్వేషాలను, భావో ద్వేగాన్ని రెచ్చ గొట్టడ మేనని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సి అవసరం ఉందని, ఈపని కేవలం ఒక్క సిపిఎం చేస్తోందని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాపాడు కోవాల్సిన అవసరం ఉంద న్నారు. అనంతరం యడ్లపాడు మండల రైతు నాయకులు కారుచోళ రోశయ్య,పెదనండిపాడు మండల కార్యదర్శి దొప్పలపూడి రమేష్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు పోపూరి సుబ్బారావు రాజారావు చేసిన ఉద్యమాలు, ఆయన నిబ ద్ధత గురించి మాట్లాడారు. కార్యక్రమంలో కె.శ్రీనివాస రెడ్డి, హరిబాబు,పీటర్‌,పద్మారావు, శంకరావు, టి.ప్రతాప ్‌రెడ్డి, సాతులూరి లూథర్‌, సాతు లూరి బాబు, పార్టీ సానుభూతి పరులు,అభిమా నులు, రాజారావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️