కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టుల భర్తీ

కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీగా ఉన్న

పనులను పరిశీలిస్తున్న కె.సి రెడ్డి

  • నోటిఫికేషన్‌ విడుదల చేశాం
  • త్వరితగతిన వసతి భవనాల నిర్మాణం

* ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి తెలిపారు. మండలంలోని ఎస్‌ఎంపురంలో గల ట్రిపుల్‌ ఐటిని మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి, చేపడుతున్న పనులపై ఆరా తీశారు. వసతి భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడొద్దని సూచించారు. మౌలిక వసతుల విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. వచ్చే ఏడాదికి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను నూజివీడు నుంచి శ్రీకాకుళం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ కోసం ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. నాక్‌ బింగ్రేడ్‌ వచ్చిందని ఎ గ్రేడ్‌ వచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ కె.వెంకటగోపాల ధనబాలాజీ, ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహనకృష్ణ చౌదరి, ఎఫ్‌ఒ అసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ రవి, డిఇ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️