కలసపాడుకు ఎత్తిపోతలు

ప్రజాశక్తి- కడప ప్రతినిధిబ్రహ్మసాగర్‌ ఎడమ కాల్వ నుంచి కలసపాడు ఎగువ ప్రాం తాలకు నీటిని తరలించనున్నారు. కడప ఎంపీ వైఎస్‌. అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు జిల్లా జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు రూ.16 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టారు. రెండు ఫేజ్‌ల్లో ఎత్తిపోతల పనుల ప్రాతిపదికన డిజైన్‌ చేశారు. మొదటి ఫేజ్‌ కింద రూ.9.50 కోట్లు, రెండవ ఫేజ్‌ కింద రూ.4 కోట్లతో పనుల్ని చేపట్టనున్నారు. ఇటీవల ప్రధాన పైప్‌లైన్‌ పనులకు టెండర్లు పిలి చారు. ఈ నెల 22న టెండర్లు తెరిచే అవకాశం ఉంది. ఎత్తిపోతల పథకం పనితీరును ఓ సారి పరిశీలిస్తే బ్రహ్మసాగర్‌ ఎడమ కాల్వలోని 21 కి.మీ దగ్గర నుంచి ఎత్తిపోతల ద్వారా కలసపాడు మండలంలోని 90 మీటర్లు ఎగువ ప్రాంతాలకు 0.29 టిఎంసిల నీటిని తర లించనున్నారు. తనుకువాగు, నేలకుంట, తప్పిరెడ్డిపల్లి సహా మరో మూడు చెరువులకు సాగునీటిని తరలించనున్నారు. దశాబ్దాల తరబడి కలసపాడు మండల పరిధిలోనే బ్రహ్మసాగర్‌ ఎడమ కాల్వ వెళ్తు న్నప్ప టికీ ఎగువ ప్రాంతంలోని సుమారు ఆరు గ్రామాలకు గుక్కెడు తాగు నీటిని నోచుకోవడం లేదు. ప్రతి ఏటా ఎగువ ప్రాంతాలకు చెందిన గ్రామీణులు తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. తాగు నీటికి కటకట ఎదుర్కొంటున్న గ్రామాల్లో వ్యవసాయం కనుమరుగైన నేపథ్యంలో వలసలు తప్పడం లేదు. ఇటువంటి గ్రామీణులకు 2024 సార్వత్రిక ఎన్నికలు వరంలా మారాయనే చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థి తులను పలుమార్లు పరిశీలించిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అభ్యర్థన మేరకు కలెక్టర్‌ స్పందించి డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డిఎంఎఫ్‌) నిధుల నుంచి రూ.16 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు కేటా యించినట్లు సమాచారం. మరో రెండు, మూడు నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో 15 రోజుల కిందట టెండర్లు పిలిచారు. ఏమేరకు కాంట్రాక్టర్లు ముం దుకు వస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారో వేచి చూడాలిమరి.

➡️