కలకలం

Feb 24,2024 21:04 #కలకలం

వైవీయూలో కలుషిత ఆహారం ఘటన కలంకలం రేపింది. ఆహారాన్ని తయారు చేయడం మొదలుకుని వడ్డించే వరకు ఉన్నత ప్రణామాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్శిటీ ఉన్నతాధికార యంత్రాంగం విద్యతోపాటు విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహార పదార్థాల విషయంలో నిరంతర పరిశీలన చేయాలి. హాస్టల్‌లో ఆహారాన్ని తయారు చేసే సిబ్బంది శుచి, శుభ్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వండిన ఆహారాన్ని పరిశీలించడానికి శాంపిల్స్‌గా తెప్పించుకుని ఓ ఉన్నతాధికారి ఆహారాన్ని తీసుకున్న అనంతరం విద్యార్థులకు వడ్డించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపక్షంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే నష్టం జరిపోతుంది. అనంతరం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుందనడంలో సందేహం లేదు. తరువాత ఎవరి మీద చర్యలు తీసుకున్నా ఎటువంటి ఫలితమూ ఉండదని గ్రహించాలి. ఆర్నెళ్ల కిందట అన్నమయ్య జిల్లా సంబేపల్లి గురుకుల పాఠశాలలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. ఏడాదిలో ఒకటి, రెండు హాస్టళ్లలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. ఇటువంటి సంఘటనల నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించాలి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఆహారం విషయంలోనే నిర్లక్ష్యం కొనసాగితే నోరులేని బాలల హాస్టల్స్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం వైవీయూలో చోటు చేసుకున్న కలుషిత ఆహారం సంఘటనలో 29 మంది అస్వస్తతకు గురైన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు హాస్టళ్లపై దృష్టి సారించాల్సి ఉంది. దీనిపై వైవీయూ ఉన్నతాధికార యంత్రాంగం విచారణ చేపట్టాలి. ఈ సంఘటనలో వైవీయూ ఉన్న తాధికార యంత్రాంగం చురుకుగా స్పందించి, హాస్పిటల్‌లో విద్యార్థులు కోలుకునే వరకు అప్రమత్తంగా వ్యవహరించడం మంచి పరిణామం. కానీ సంఘటనకు పూర్వమే జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. విద్యార్థి సంఘాల ఆందోళనలతో యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పవచుఉ్చ. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలేమిటో ఆరా తీయాలి. ఎక్కడ పొరపాటు దొర్లిందో గుర్తించాలి. భవిష్యత్‌లో ఇటువంటి నిర్లక్ష్యపు సంఘటనలు పునరా వృతం గాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️