కన్నుల నిండుగా.. పిల్లల పండుగ..

Feb 19,2024 00:11

జానపద నృత్య ప్రదర్శనలో విద్యార్థినులు
ప్రజాశక్తి-గుంటూరు : ఆదరణ తగ్గుతుందుకున్న కోలాటానికి ప్రాణం పోస్తూ… జానదపద నృత్యాలు… దేశభక్తి గేయాలు… వ్యర్థ పదార్థాలతో ఉపయోగపడే పరికరాల తయారీ… విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు క్విజ్‌ వంటి రకరకాల ఈవెంట్లతో గుంటూరు బాలోత్సవం ఆద్యంతం కన్నుల పండుగను తలపించింది. స్థానిక హిందూ కాలేజి ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న గుంటూరు జిల్లా బాలోత్సవంలో రెండో రోజూ తరగని ఉత్సాహంతో చిన్నారులు వేలాది మంది పాల్గొన్నారు. కోలాటానికి ఆదరణ తగ్గుతుంద నుకుంటున్న నేపథ్యంలో ఈ బాలోత్సవంలో దాదాపు 20 పాఠశాలల నుండి విద్యార్థులు కోలాటం ప్రదర్శించారు. జానపద నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. రెండో రోజు దాదాపు 14 ఈవెంట్లలో వేలాది మంది విద్యా ర్థులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఆదివారం నాటి బాలోత్సవ ప్రాంభానికి దీప్తి పబ్లికేషన్స్‌ అధినేత ఎ.ఆంజనేయులు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ పాల్గొని సందేశమిచ్చారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో మలినేని విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ మలినేని పెరుమాళ్లు, కిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజి చైర్మన్‌ కోయి సుబ్బారావు, కాటూరి పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌ ఎన్‌.వీరప్రకాష్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మున్సిపల్‌ పట్టణాల్లోనూ బాలోత్సవాలు నిర్వహించి, విద్యార్థులకు మరింత చేరువ చేయటానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది జెడ్పీ స్కూల్స్‌ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనటం శుభపరి ణామం అని చెబుతూ వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. మలినేని పెరుమాళ్లు, కోయి సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఏటా వేలాది మందితో బాలోత్సవం నిర్వహిస్తున్న జెవివికి, విద్యార్థు లను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా రోజువారీ ఒత్తిడి అధిగమించటానికి, బృందతత్వం పెంపొ ందించుకోవటానికి దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం ఈవెంట్ల వారీగా విజేత లకు బహుమతులను అతిథులు ప్రదానం చేశారు. ఓవరాల్‌ఛాంప్‌గా గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌, రన్నర్స్‌గా బాలకుటీర్‌ నిలిచాయి. కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.జాన్‌బాబు, బి.ప్రసాద్‌, ట్రెజరర్‌ వెంకట్రారావు, బాలోత్సవం కన్వీనర్లు డాక్టర్‌ ఎం.బోసుబాబు, కె.వి.ఎస్‌.దుర్గారావు పాల్గొన్నారు.

➡️