కనిగిరిలో పసుపు జెండా ఎగరేస్తాం: ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి బాపట్ల జిల్లా పర్చూరు పర్యటనలో భాగంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నేతలతో కలిసి కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చంద్రబాబు చర్చించారు. కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడేలా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు డాక్టర్‌ ఉగ్ర చంద్రబాబుకు తెలియజేశారు. మన ఊరు -మన ఉగ్ర, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరిస్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు డాక్టర్‌ ఉగ్ర వివరించారు. చంద్రబాబు నాయుడు డాక్టర్‌ ఉగ్రను అభినందించారు.

➡️