ఏనుగుల గుంపు హల్‌చల్‌ సోలార్‌ ఫెన్సింగ్‌ ధ్వంసం అరటి, మామిడి, చెరకు పంటకు నష్టం

ఏనుగుల గుంపు హల్‌చల్‌ సోలార్‌ ఫెన్సింగ్‌ ధ్వంసం అరటి, మామిడి, చెరకు పంటకు నష్టం

ఏనుగుల గుంపు హల్‌చల్‌ సోలార్‌ ఫెన్సింగ్‌ ధ్వంసం అరటి, మామిడి, చెరకు పంటకు నష్టంప్రజాశక్తి- ఐరాల: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజక వర్గం ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ చుక్కావారిపల్లి గ్రామంలో 19 ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది. గత రెండు రోజులుగా గ్రామశివారుల్లోని పంటపొలాల్లోని పంటలను తిని తొక్కి నాశనం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన రైతులకు చెందిన అరటి, మామిడి, చెరకు పంటలతో పాటు అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న సోలార్‌ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. ఏనుగుల వల్ల చేతికందిన పంట నష్టపోతున్నామని, దాదాపు 3 లక్షల రూపాయల మేర నష్టం వచ్చిందని తెలిపారు. ఏనుగుల భారీ సంఖ్యలో ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్ట వేయడంతో అవి ఎప్పుడు పంటలపై, తమపై దాడి చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతే కాకుండా అటవీ ప్రాంతంలో ఏనుగులు ధ్వంసం చేసిన సోలార్‌ ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేసి ఆదుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరారు.

➡️