ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాస పరీక్ష

Feb 4,2024 20:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా ఆదివారం పదో తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నగరంలోని కస్పా హైస్కూలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెవిఅర్‌కె ఈశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ వెంకటేష్‌ హాజరై ప్రశ్నా పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంగా విద్యార్థులతో ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతుందని అన్నారు. పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమవు తున్నవిద్యార్థులకు ఇటువంటి పరీక్షలు నిర్వహించి వారిలో భయాందోళనలు పోగొట్టేందుకు, వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారికి జిల్లా మొదటి స్థానానికి రూ. 5వేలు, రెండో స్థానానికి రూ.2వేలు, మూడోస్థానం రూ.2వేలు బహు మతిగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్‌, ఎం.సౌమ్య, ఎం.వెంకటేష్‌ జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్‌, ఎస్‌ సమీరా, జిల్లా కమిటీ సభ్యులు కె. రాజు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు పట్ల భయం వీడాలి బొబ్బిలి : పరీక్షలు పట్ల విద్యార్థులు భయం వీడాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి అన్నారు. ఎస్‌.ఎఫ్‌.ఐ ఆధ్వర్యంలో శ్రీసాయి డిగ్రీ కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలను యుటిఎఫ్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ నాయకులు విడుదల చేశారు. ఈసందర్భంగా విజయగౌరి మాట్లాడుతూ పరీక్షలు పట్ల భయం వీడితేనే పబ్లిక్‌ పరీక్షలు బాగా రాయగలరని విద్యార్థులకు సూచించారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎస్‌.ఎఫ్‌.ఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్ర మంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మణికుమార్‌, ఇన్విజిలేటర్లుగా యుట ిఎఫ్‌ నాయకులు ప్రసన్నకుమార్‌, కేశవ్‌, రామకష్ణ వ్యవహరించారు. కార్యక్ర మంలో ఎస్‌.ఎఫ్‌.ఐ నాయకులు డేవిడ్‌, కిరణ్‌, లోకేశ్వరి, వసంత, పాల్గొన్నారు.కొత్తవలస : స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. వాగ్దేవి విద్యాసంస్థల కరస్పాండెంట్‌ మహేష్‌, ప్రిన్సిపాల్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాయుడు, గణేష్‌ పరీక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చైతన్య, నాయుడు, తేజ తదితరులు పాల్గొన్నారు.జామి : మండలంలోని పలు పాఠశాలలలో 10 వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.హర్ష మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు రవి, జైతు పాల్గొన్నారు.బాడంగి : విద్యార్థులు భయం పోగొట్టడమే ప్రజ్ఞా వికాస పరీక్ష లక్ష్యమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కోడూరు జెడ్‌పి హైస్కూలులో ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. 200 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

➡️